భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 22: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగేకు సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.