e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home వనపర్తి Wanaparthy: జూరాలకు పర్యాటక శోభ.. పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Wanaparthy: జూరాలకు పర్యాటక శోభ.. పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాకే తలమాణికంగా నిలిచే ప్రియదర్శిని జూరాల ప్రాజక్ట్‌కు పర్యాటక శోభ వచ్చింది. ఎన్నో ఏండ్లు గా ప్రాజక్ట్ పరిసరాలు అభివృద్ధికి నోచు కోక పర్యాటక ప్రాభవాన్ని కోల్పోతున్న తరుణంలో జిల్లాకు చెందిన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తొలి అడుగు పడింది. ప్రాజక్ట్‌కు కుడి వైపున గార్డెన్ (పార్క్) నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం శంఖుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశిష్ఠ అతిథులుగా మంత్రులు కేటీఆర్, శ్రీని వాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మె ల్యేలు గువ్వల బాల్‌రాజ్, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహాంలతో శంఖుస్థాపన పూజ నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రణాళిక చిత్రావళిని మంత్రి వీక్షించారు. మంత్రి టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తాతో మాట్లాడుతూ జూరాలను అద్భుత పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం గద్వాల, ఆత్మకూరు, అమరచింత మండల్లాల నేతలు మంత్రిని కలిసి సత్కరించి, శుభా భినందనలు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేలు ,జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి తదితరులు హెలీప్యాడ్ వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. పార్క్ నిర్మాణ ప్రాంతంలో వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్థానిక నేతలు మంత్రిని కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. 14 ఏకరాల స్థలంలో మొద టి దశ పనులను రూ. 15 కోట్లతో అత్యా ధునిక వసతులతో గార్డెన్ నిర్మించేందుకు పనులను ప్రారంభించనున్నట్లు టూరి జం శాఖ ఎండీ. మనోహర్‌రావు తెలిపారు. మలి దశ పనుల్లో దాదాపు 70ఎకరాల స్థలంలో జూరాలను గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana