సలేశ్వరం.. జనసంద్రం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. లింగమయ్యను దర్శించుకొని పూజలు చేశారు. శ్రీశైలం రహదారిలో రద్దీ నెలకొనగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
అచ్చంపేట, ఏప్రిల్ 23 : చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. లింగమయ్యను దర్శించుకొని పూజలు చేశారు. శ్రీశైలం రహదారిలో రద్దీ నెలకొనగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వేసవి తాపం పెరిగినా లింగమయ్యను చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరాగా చెంచులే పూజారులుగా వ్యవహరిం చి స్వామికి పూజలు చేశారు. వస్తున్నాం లింగమ య్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. అంటూ భక్తుల నినాదాలతో అటవీ ప్రాంతమంతా మార్మోగింది. బుధవారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఎస్సీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులతో భారీ భద్రతా చర్యలు చేపట్టగా అటవీశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లను నియమించారు. రాంపూర్ పార్కింగ్ స్థలం వద్ద పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వలంటీర్లు సేకరించి మన్ననూర్లోని రిసైకిల్ షెడ్డుకు తరలించారు. దాదాపు మూడు ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

