e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home వనపర్తి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

వనపర్తి, మే 25 : జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి, కూరగాయల మార్కెట్‌లో విక్రయదారులకు మాస్కుల పంపి ణీ కార్యక్రమాన్ని మం గళవారం నిర్వహించినట్లు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ఖాజాఖుతుబొద్దీన్‌ తెలిపారు. ప్రభు త్వ కార్యాలయ సిబ్బంది అదేవిధంగా మార్కెట్‌లో విక్రయదారులకు మాస్కులను అందించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్‌ సభ్యులతో కలిసి నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యు లు హర్షద్‌, రాజేందర్‌, లక్ష్మణ్‌, అనురాధ, గిరిశ్‌ చంద్ర, శ్రీనివాసులు, పాషా, గోవింద్‌ పాల్గొన్నారు.

పాన్‌గల్‌లో..
పాన్‌గల్‌, మే 25 : మండలంలోని శాగాపూర్‌ తండాలో కరోనా బా ధితులకు మంగళవారం హర్షన్న యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు రంగాపూర్‌ శివారెడ్డి శానిటైజర్లు, మాస్కులు, డ్రైఫ్రూట్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాకు మనోధైర్యమే సరైన మందని తెలిపారు. ఆయన వెంట హర్షన్న యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్తకోటలో..
కొత్తకోట, మే 25 : పట్టణంలోని 6వ వార్డులో జయప్రకాశ్‌ కాలనీ లో నివాసం ఉంటున్న కరోనా బారిన పడిన పేదలకు మంగళవారం ఆ వార్డు కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి డ్రైఫ్రూట్స్‌ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌ పంపించినటువంటి డ్రైఫ్రూట్స్‌ ప్యాకెట్లను కరోనా బాధితులకు ఇచ్చి మనోధైర్యంగా ఉండాలన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

ట్రెండింగ్‌

Advertisement