e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు 15 నుంచి రైతుబంధు

15 నుంచి రైతుబంధు

15 నుంచి రైతుబంధు

పట్టుదలతో గ్రామాలను అభివృద్ధి చేయండి
సర్వసభ్య సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

మానవపాడు, జూన్‌ 11 : ఈనెల 15 నుంచి 59 ల క్షల 60 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మానవపాడు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యా శాఖలకు సంబంధించిన ఎజెండా అంశాలను చదివి వినిపించారు.

అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగా ణ ముందు వరుసలో నిలిచిందన్నారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముం దు చూపుతో అభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మహానగరాలను తలదన్నేలా కొ న్నేండ్లలో గ్రామాలు మారనున్నాయని చెప్పారు. నిధుల కేటాయింపుతోనే అభివృద్ధి జరగదని, ఇందులో అం దరూ భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో ధాన్యం పండించే రాష్ట్రంలో పంజాబ్‌ ముందు వరుసలో ఉండేదని, నేడు తెలంగాణ ఏడాదికి 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండిస్తుందని తెలిపారు. ఈ ఏడాది రైతుల అవసరాలకుమించి ఎరువులు నిల్వ ఉన్నాయని మంత్రి చెప్పారు. అలంపూర్‌ నియోజకవర్గానికి 100 పడకల దవాఖాన నిర్మాణానికి సంబంధించి జీవో విడుదల అయిందన్నారు. నకిలీ విత్తనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రతి రోగి ప్రభుత్వ దవాఖానలోనే వైద్య సేవలు పొందే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోండి : ఎంపీ
గ్రామాలను కలసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని ప్ర జాప్రతినిధులు, అధికారులకు ఎంపీ రాములు సూచించారు. మండల సర్వసభ్య సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ వచ్చారని, దీంతో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కూలీలకు ఉపాధి కల్పించాల్సిన సిబ్బంది, ప్రజాప్రతినిధులకు తెలియజేయకుండా పనులు చేయొద్దన్నారు.
రాజకీయాలు చేయొద్దు : జెడ్పీ చైర్‌పర్సన్‌
గత నెలలో జల్లాపురంలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా.. రాజకీయం చేస్తూ 20 రోజుల తర్వాత శవాలకు పోస్టుమార్టం నిర్వహించారని, ఇది ఎంత వ రకు సబబు అని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ప్రశ్నించారు. ఇ లా శవాలపై రాజకీయం చేయడం మంచిది కాదని సూ చించారు. సమిష్టిగా గ్రామాలాభివృద్ధి చేసుకోవాలన్నారు.
నిధులు వినియోగించుకోండి : ఎమ్మెల్యే
గతంలో లేనంతా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ హయాంలో గ్రామాల రూపురేఖలే మారుతున్నాయని చెప్పారు. అనంతరం కొనసాగిన ఎజెండా అంశాల్లో రోడ్లు భవనాలు, ఉపాధి సిబ్బందిపై ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఈ, ఈజీఎస్‌ ఈసీని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఈత చెట్లుగానీ, తాటి చెట్లుగానీ లేవని, ఇలాంటి పరిస్థితుల్లో కల్లు ఎలా తయారు చేస్తున్నారని, కల్తీకల్లు అమ్మకాలను అడ్డుకోవాలని ఎక్సైజ్‌ సీఐ బానోతు పటేల్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
15 నుంచి రైతుబంధు

ట్రెండింగ్‌

Advertisement