e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home వనపర్తి PANGAL: మోదీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం: తమ్మినేని

PANGAL: మోదీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం: తమ్మినేని

పాన్‌గల్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ చట్టా లను అమలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మండలం లోని రేమద్దుల గ్రామంలో నూతనం గా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంగళవారం ఆయన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్‌తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన ప్రజాకంటకంగా వ్యవహారిస్తు న్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నోట్ల రద్దు చేసి, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబం ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు.
రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం అమలు చేయాలని పూనుకోవడం ధారుణమన్నారు.

- Advertisement -

పెట్రోలు, డీజీల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచారరు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర వాటిని ప్రవేటీకరణకు చేసేందుకు కుటీల ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, బి.వెంకట్, పుట్టా ఆంజనేయులు, దేవేందర్, బాల్‌రెడ్డి, వేణుగోపాల్, బాల్యానాయక్, వెంకట య్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement