వనపర్తి : జిల్లాలోని మదనాపురం మండలం గోవింద హళ్లి గ్రామంలో 100% కొవిడ్ వ్యాక్సిన్ చేపట్టే ప్రక్రియను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఈషా అంపాని అమెరికా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి బహుమతులు అందజేశారు.