గురువారం 29 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 25, 2020 , 06:11:14

రైతు వేదికలు, ప్రకృతి వనాలను పూర్తి చేయాలి

రైతు వేదికలు, ప్రకృతి వనాలను పూర్తి చేయాలి

  • ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకుఅవగాహన కల్పించాలి
  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

ఖిల్లాఘణపురం : మండలంలోని ఆయా క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతుభవనాలు, పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు మండలంలోని సోలీపూర్‌ మానాజీపేట, పర్వతాపూర్‌ గ్రామాల్లోని రైతు వేదికల, ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రైతు వేదిక భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అనుకున్న సమయానికి రైతు వేదిక భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలను ఈనెల చివరి వరకు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం, తాసిల్దార్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించి తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఆయా కార్యాలయాల్లో రికార్డులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్‌, జెడ్పీటీసీ సామ్యనాయక్‌, సర్పంచులు వెంకటరమణ, పద్మశ్రీ, సతీశ్‌, నిర్మల, మండలాధ్యక్షుడు కృష్ణయ్య, విక్రమ్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. logo