e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home వికారాబాద్ తీసుకొస్తరు.. వాళ్లే తీసుకెళ్తరు

తీసుకొస్తరు.. వాళ్లే తీసుకెళ్తరు

తీసుకొస్తరు.. వాళ్లే తీసుకెళ్తరు

సిటీబ్యూరో, ఏప్రిల్‌ 1 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునే వయోధికులకు హెల్పేజ్‌ ఇండి యా అండగా నిలవనున్నది. ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్క డి నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యత తీసుకోనున్నది. రైడ్‌ బుక్‌ చేసి ఇంటికే క్యాబ్‌ పంపిస్తారు. ఈ మేరకు హెల్పేజ్‌ ఇండియా ఉబర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. అందుకు సంబంధించిన ఆమోదం లభించాక ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి డోస్‌, రెం డో డోస్‌ పూర్తయ్యే వరకు క్యాబ్‌ సర్వీస్‌ అందించనున్నది. అందుకు సంబంధించిన రైడ్‌ చార్జీలను హెల్పేజ్‌ ఇండియా భరిస్తుందని సంస్థ కో ఆర్డినేటర్‌ కళాధర్‌ తెలిపారు.

సేవలు ఇలా పొందొచ్చు..
టోల్‌ ఫ్రీ నంబర్‌-18001801253కు ఫోన్‌ చేసి సేవలను పొందొచ్చు. ఈ నంబర్‌లో హెల్పేజ్‌ ఇండియా సభ్యులు అందుబాటులోకి వస్తారు. వ్యాక్సినేషన్‌ తీసుకోవాలనుకునే వృద్ధులు తమ చిరునామాను, మొబైల్‌ నంబర్‌ను వారికి తెలియజేస్తే వారే క్యాబ్‌ బుక్‌ చేస్తారు. వ్యాక్సిన్‌ పూర్తయ్యాక మరొకసారి ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పాలి. క్యాబ్‌ బుక్‌ చేసి సంబంధిత ఆస్పత్రికి పంపిస్తారు. అక్కడి నుంచి ఇంటికి చేర్చడంతో సేవలు ముగుస్తాయి. రంగారెడ్డి, శివారు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వివరించారు.

ఇవీ కూడా చదవండీ..

స‌ఫ్దార్‌జంగ్ ఆస్ప‌త్రి లో అగ్నిప్ర‌మాదం

మోదీ.. ఎల్‌కే అద్వానీ ఎక్క‌డ‌?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తీసుకొస్తరు.. వాళ్లే తీసుకెళ్తరు

ట్రెండింగ్‌

Advertisement