ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 11, 2021 , 00:20:10

పర్యాటకులతో అనంతగిరిలో సందడి

పర్యాటకులతో అనంతగిరిలో సందడి

వికారాబాద్‌, జనవరి10: జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండల్లో నెలకొన్న ఆనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటకులు భారీగా వచ్చారు. ఈ దేవాలయంలోని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతి శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ప్రాంతాల నుంచి వస్తున్నారు. భక్తులు ముందుగా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న కోనేటిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అనంతగిరిలో వ్యూ పాయింట్ల వద్ద కొండల అందాలను వీక్షించారు. అక్కడి నుంచి ఘాట్‌ రోడ్డులో ఉన్న నంది విగ్రహం వద్ద పర్యాటకులు సెల్పీలు దిగుతూ ఆహ్లాదంగా గడుపుతారు. అనంతరం వనభోజనాలు చేసి, వివిధ రకాల ఆటలు ఆడి సాయంత్రం వెళ్లిపోయారు. 

VIDEOS

logo