శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 01, 2021 , 01:31:09

దశలవారీగా వార్డుల అభివృద్ధి

దశలవారీగా వార్డుల అభివృద్ధి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌, డిసెంబర్‌ 31 : దశలవారీగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో ఐదో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదించిన 19 ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. ఎజెండాలో ఎస్సీ, ఎస్టీ నిధులు రూ.45.20లక్షలు, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు కోటి 23లక్షల35వేల రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ను కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడం జరిగిందన్నారు. వివిధ వార్డుల్లో ఉన్న సమస్యలను చైర్‌ పర్సన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి దశలవారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను మున్సిపల్‌ అధికారులు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంషాద్‌బేగం, కమిషనర్‌ బోగేశ్వర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo