సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందోల్/సంగారెడ్డి : సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సర్వే పనుల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ మూడు నియోజకవర్గాలలో సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరిందించే ఈ ప్రాజెక్టు సర్వే పనులను మంత్రి హరీశ్ రావు ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 57 వేల ఎకరాలకు, ఆందోల్ నియోజకవర్గంలో సుమారు 56 వేల ఎకరాలకు, జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు లక్ష ఆరు వేల ఎకరాలకు సాగు నీరందనుంది. ఈ ప్రాజెక్టులో రెండు పంప్ హౌస్ లను నిర్మించనున్నట్లు సాగు నీటి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు.
మొదటి పంపు ద్వారా హైద్లాపూర్ నుంచి వెంకటాపూర్ డెలివరీ సిస్టం వరకు సుమారు 125 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయనున్నట్లు చెప్పారు. ఈ డెలివరీ సిస్టం నుంచి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా దాదాపు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు.
ఈ పనుల ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు విపులంగా చర్చించారు.
రెండో లిప్ట్ ను జహీరాబాద్ కెనాల్ పై హతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రెండు లక్షల 19 వేల ఎకరాలకు నీరందించే ప్రణాళికలో భాగంగా రెండవ లిఫ్ట్ ద్వారా సుమారు 42 వేల ఎకరాలకు నీరిందిస్తామని చెప్పారు.
ఈ రెండో లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు నీరు అందుతుందని వివరించారు. వేగంగా సర్వే పనులు ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు సాగు నీటి శాఖ అధికారులకు, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
సమీక్షలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి సీఈవీ అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, జహీరాబాద్ ఈఈ ,ఎస్. సుబ్రమణ్య ప్రసాద్, సంగారెడ్డి ఈఈపీ మధుసూదన్ రెడ్డి, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధి బి. మధుసూదన్ రెడి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్‌ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

