సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Nov 30, 2020 , 05:57:31

ఆహ్లాదభరితం.. భక్తిపారవశ్యం

ఆహ్లాదభరితం.. భక్తిపారవశ్యం

ధారూరు: ఆదివారం సెలవు దినం.. కార్తికపౌర్ణమి కావడం భక్తితో పాటు ఆహ్లాదానికి నెలవుగా ఏర్పడింది. ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రా జెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కోట్‌పల్లి ప్రా జెక్టుకు చుట్టూ పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లాల నుంచి కుటుంబ సభ్యులతో భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నీటిలో ఈత కొడుతూ, ఆటలాడారు. ఫొటోలు, సెల్పీలు తీసుకున్నారు. ప్రాజెక్టు ఆవరణలో మిఠాయి, పండ్ల దుకాణాలు, చిన్న హోటళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అనంతగిరిలో కార్తిక దీపారాధన 

కొవిడ్‌-19 సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని మూసేశారు. దీంతో భక్తులు కార్తిక పౌర్ణమి సందర్భంగా అనంతగిరి దేవాలయం ఎదుట దీపాలు వెలిగించి పూజలు చేశారు. కార్తిక మాసంలో ప్రతి ఏటా నిర్వహించే జాతరను రద్దుచేశారు.

VIDEOS

logo