సోమవారం 26 అక్టోబర్ 2020
Vikarabad - Oct 07, 2020 , 00:16:18

ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

కొడంగల్‌/బొంరాస్‌పేట/దౌల్తాబాద్‌: పట్టభద్రుల ఓటర్ల నమోదును పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదుపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు కోసం నియమించిన ఇన్‌చార్జ్‌లు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలని, మండల నాయకులు నాలుగైదు గ్రామాలకు వెళ్లి ఓటర్ల నమోదును పర్యవేక్షించాలని ఆదేశించారు. 2017 నాటికి డిగ్రీ పూర్తిచేసిన  వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వారందరినీ కలిసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు.  ఓటర్ల నమోదును పకడ్బందీగా చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి చేసిన దరఖాస్తులను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo