సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 19, 2020 , 23:21:43

కరోనాను కట్టడి చేద్దాం

కరోనాను కట్టడి చేద్దాం

  • ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం
  • గ్రామాల్లో పోస్టర్లను అతికిస్తున్న సిబ్బంది
  • వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు నిరంతరంగా పారిశుధ్య పనులకు ఆదేశం
  • శుభకార్యాలు, సభలు, సమావేశాలు వద్దని సూచన
  • ప్రార్థన మందిరాలకు సైతం వెళ్లొద్దని పిలుపు
  • విదేశాల నుంచి వచ్చినవారు స్వీయ నిర్బంధం తప్పనిసరి
  • దగ్గు, జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలంటున్న అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా యం త్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామ పంచాయతీలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది ఇందుకు సంబంధించిన సూచనలతో కూడిన పోస్టర్లను అన్ని గ్రామాల్లో అతికిస్తున్నారు. కలెక్టరేట్‌తోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలెవరూ రాకూడదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి ఇటీవలే వచ్చిన వారు 14రోజుల పాటు ఎవరినీ కలవకుండా తమకు తామే స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు. శుభకార్యాలతోపాటు సభలు, సమావేశాలను వాయిదా వేసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. 

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు  యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే  సినిమా హాళ్లను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. గ్రామాల ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి గ్రామపంచాయతీలో  జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా పట్ల భయాందోళన చెందొద్దని, ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఉన్నతాధికారులు   ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డప్పు చాటింపు, గ్రామసభల ద్వారా అవగాహన కల్పించేందుకు నిర్ణయించినప్పటికీ జన సమూహం ఏర్పడే అవకాశమున్న దృష్ట్యా గ్రామాల్లో పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, కొన్ని రోజులపాటు   ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలెవరూ రావద్దని  మరోవైపు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లవద్దని చెప్పారు.  ఇతర దేశాల నుంచి వచ్చినట్లయితే వారే స్వీయ గృహ నిర్భంధం చేసుకొని 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని  

ఊరూరా పోస్టర్లతో అవగాహన

జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా పంచాయతీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ ్భపధాన కూడళ్లలో పోస్టర్లను అతికిస్తున్నారు.  తిరగరాదని,  సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచిస్తున్నారు. ప్రతిరోజు  పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని,  నీరు పారకుండా, నిల్వ లేకుండా చూడాలని,క్రమం తప్పకుండా బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌  జిల్లా పంచాయతీ అధికారి సర్క్యులర్‌ జారీ చేశారు. దగ్గు లేదా జ్వరం ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు.  నుంచి బయటకు వచ్చే ముందు మాస్క్‌లు ధరించాలని,  నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. 60 ఏళ్లకు పైబడినవారు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ్మగామ సర్పంచ్‌ లేదా మండల పంచాయతీ అధికారి లేదా గ్రామపంచాయతీ కార్యదర్శికి సమాచారమివ్వాలని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా సూచించారు. 

ప్రభుత్వ కార్యాలయాలకు 

కరోనా వ్యాప్తి ఆగే వరకు కలెక్టరేట్‌తోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలెవరూ  రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రతిఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని, అయితే కొన్ని రోజులు మాత్రం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.

ఇతర దేశాల నుంచి వచ్చినవారు సహకరించాలి

ఇతర దేశాల నుంచి   బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో,  తమ ఇండ్లలోనే స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని తెలిపారు. 14 రోజుల వరకు ఎవరినీ కలువకుండా ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సామాజిక, మతపరమైన సమావేశాలకు హాజరు కాకూడదని, సబ్బు లేదా నీటితో లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని, ప్రతి 6-8 గంటలకు ఒకసారి మాస్క్‌ మార్చాలని, ఉపయోగించిన మాస్క్‌ను మూసివేసిన డబ్బాలో వేయాలని తెలిపారు.

జలుబు, దగ్గు ఉన్నవారు చికిత్స చేయించుకోవాలి 

జలుబు, దగ్గు తదితర లక్షణాలు ఉన్నవారు  ప్రభుత్వ దవాఖానకు వచ్చి చికిత్స  కరోనా వైరస్‌ దానంతట అదే వ్యాప్తి చెందదు.  ఉన్న వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బయట తిరిగేవారు గంటకోసారి శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి.  పిల్లలు, వృద్ధులకు ఈ వైరస్‌  సోకేందుకు అవకాశాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వయస్సులో ఉన్నవారిపై  ప్రభావం చూపదు. కొన్ని రోజుల వరకు పార్టీలు, పెండ్లిళ్లు, వేడుకలకు  దూరంగా ఉండాలి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అధికారులకు సమాచారం అందించి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 

- శాంతప్ప, వికారాబాద్‌ ఏరియా  సూపరింటెండెంట్‌ 


logo