Loksabha Elections 2024 : యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన హామీని నిలబెట్టుకున్నారా అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. మోదీతో దేశానికి మేలు జరుగుతుందని చెబుతున్న కాషాయ నేతలు భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, గోధుమల ధరల గురించి ఏమంటారని నిలదీశారు.
మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే మంగళవారం యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో అందలం ఎక్కిన మోదీ ఆపై ఉపాధి కల్పనను విస్మరించారని, ఈ విషయంలోనూ కాషాయ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Read More :