
పెద్దేముల్, ఆగస్టు :సీఎం కేసీఆర్ సహకారంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగులపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో డిఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంఖుస్థాపనలు చేశారు. నాగులపల్లి గ్రామంలో పీర్ల వాగును పరిశీలించి, గొర్రెలకు నట్టల మందు అందించారు. మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయ శంకర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకంగా “పల్లె ప్రగతి “కార్యక్రమాన్ని అమలుచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా ప్రణాళికలు చేసి ప్రతినెలా గ్రామాలకు నిధులు కేటాయించి గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు.
ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలకు కనీస అవసరాల దృష్ట్యా మౌళిక సదుపాయాలను కల్పించి వారిక ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారని అన్నారు. నాగులపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పీర్ల వాగును పరిశీలించి వెంటనే వాగుపై నూతనంగా బ్రిడ్జిని నిర్మించడానికి ప్రతిపాదనలు చేయాలని ఆదేశించారు. నాగులపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజలు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారిని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మురళీగౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీశైల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మట్ట భాగ్యలక్ష్మీ, రాములు, ఎంపీటీసీ మట్ట సురేఖ, జెడ్పీటీసీ ధారాసింగ్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు టి.రమేష్,మట్ట శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు,శేఖర్ రెడ్డి,రాంరెడ్డి,గోపాల్ రెడ్డి,సంజీవరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మప్ప,ఎంపీఓ షేక్ సుష్మా, జితేందర్ రెడ్డి, నరేష్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, డివై నర్సింహులు, ఆయా గ్రామాల నాయకులు, వివిధ శాఖ అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.