
దౌల్తాబాద్, ఆగస్టు :బాలలహక్కుల పరిరక్షణకు గ్రామ పంచాయతీల పాత్ర ఉండాలని సిడబ్ల్యూసి కమిటి చైర్మన్ వెంకటేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ కోట్ల మహిపాల్,ఎంపీఓ రవీందర్ ఆద్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ గ్రామపంచాయతీల పాత్రపై గ్రామబాలల పరిరక్షణ కమిటి , మహిళ,శిశుసంక్షేమ శాఖ వికారాబాద్ జిల్లా 1098,181,100 పై అవగహన కల్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల్లో బాలల భవిషత్తు, అలాగే బాల్యవివాహాలని నివారించాలని కోరారు. అక్రమ దత్తత చట్టవిరుద్దమని, ప్రతి గ్రామ పంచాయతీలో విలేజ్ చైల్డ్ ప్రోజెక్షన్ కమిటికి సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యదర్శులుగా అంగన్వాడీ టీచర్ నియమించాలని కోరారు.
చిన్నారులకు తల్లిదండ్రులు లేనివారు ఉంటే ఎంపీడీఓ దగ్గరికి తీసుకవస్తే గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ చేయిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల స్వామి,అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు,ఐసిడిఎస్ సుపర్వైజర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.