(YouTuber) ఇటీవలి కాలంలో యూట్యూబర్లు ఎక్కువైపోయారు. ఎంటర్టైన్మెంట్, ఫుడ్స్, టూర్స్, ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఇన్ఫో, కామెడీ, మోటివేషనల్, కుకింగ్, మ్యూజిక్.. ఇలా ఒక్కటేంటి.. అన్నిరకాల యూట్యూబ్ ఛానళ్లు వచ్చేశాయి. ఎవరికి వారు తమ తమ నైపుణ్యం, మాటల గారడి, ఆకట్టుకునే వర్చస్సు, చూపించే విధానం.. ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేక్షకులు చూడటం, సబ్‌స్క్రైబ్ చేయడం వంటి వాటితో యూట్యూబర్లకు కాసుల వర్షం కురుస్తున్నది. అయితే, ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకోవాలన్న ప్రయత్నంలో ఓ యూట్యూబర్ ఏకంగా తన కొత్త ఆడి కారును కాల్చి బూడద చేశాడు. మరో యూట్యూబర్ మొసలికి బలైన సంఘటనలు ఉన్నాయి. అయితే, వెరిటాసియం అనే యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహించే డెరెక్ ముల్లర్.. అందరికన్నా భిన్నంగా ఉండాలని తాపత్రపడి ఏం చేశాడంటే..!
వెరిటాసియం అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు డెరెక్ ముల్లర్.. 2014 యూఎస్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఏకంగా ఓ హెలికాప్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు. ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో 19 వ ప్రశ్నగా.. హెలికాప్టర్ గాలిలో ఎగురుతున్న సమయంలో దాని కిందికి ఏకరీతి కేబుల్ వేస్తే ఎలా వేలాడుతుంది? అని ఊహాజనిత ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం తెలుసుకునేందుకు డెరెక్ ముల్లర్.. ప్రశ్నలో అడిగినట్లుగానే ఏర్పాట్లు చేసుకుని హెలికాప్టర్లో బయల్దేరాడు. హెలికాప్టర్లో బయల్దేరడానికి ముందుగా అతను ఆ ప్రశ్నను సంపూర్ణంగా చదివి వినిపించాడు. సరైన సమాధానం ఏమిటనే దానిపై కొంత గందరగోళం ఉన్నప్పటికీ.. ఎలాంటి సాధారణ సాధనాలను ముల్లర్ ఉపయోగించలేదు. అన్ని చర్చలను ఒకేసారి ముగించాలని స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాడు.
ఈ ప్రయోగం చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సరైన సమాధానం ‘డీ’ అనే ఎంపికపై నిర్ణయానికి వచ్చాడు. అయితే, ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసిన ప్రశ్నకు ఎంతో మంది జవాబిచ్చారు. వీరిలో 40 శాతం మంది ‘సీ’ అని జవాబివ్వగా, 25 శాతం మంది ‘బీ’, 21 శాతం మంది ‘డీ’ అని సమాధానమిచ్చారు. సమాధానం ఏమైనప్పటికీ డెరెక్ ముల్లర్ తన యూట్యూబ్ వేదికగా ఒక కొత్త ప్రయత్నానికి పూనుకోవడం ఆన్లైన్లో అనేక మంది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇలాంటి వీడియోలు చేసి మరీ ఆ వివాదాస్పద ప్రశ్నకు సమాధానం దొరకబుచ్చుకోవాలనే ముల్లర్ ప్రయత్నాన్ని నెటిజెన్లు ప్రశంసించారు.
అన్నీ వదిలేసి.. ఆ వైన్ బాటిళ్లనే ఎత్తుకెళ్లారు.. ఎందుకో తెలుసా!
పాకిస్తాన్ జాతీయ బ్యాంకుపై సైబర్ దాడి
ఇలా చేయడం అంటే.. మోదీ మళ్లీ రోమ్కు వెళ్తాననడమే..!
నీరజ్ చోప్రాకు చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ జెర్సీ
త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..