(Rare Wine steal) చాలా మంది వైన్ బాటిల్‌పై ఉన్న తయారీ సంవత్సరం చూసి కొనుగోలు చేస్తుంటారు. ఎంత పాతదైతే అంత ఖరీదైనదిగా ఉంటుంది. పాత వైన్‌కు ఎంతో డిమాండ్ ఉంటుంది. అతి పురాతన వైన్ దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఇలాంటి వైన్ బాటిళ్లను ఎత్తుకెళ్తే చాలు లక్షాధికారులం కావచ్చునని భావించారో.. ఏమో కానీ ఓ జంట అచ్చం ఇలాంటి పనే చేసింది.
స్పెయిన్‌కు చెందిన ఓ ప్రైవేట్ వైన్ కలెక్టర్ వద్ద పనిచేస్తున్న ఓ పురుషుడు, ఓ మహిళ కలిసి స్పానిష్ రెస్టారెంట్లో భారీ దొంగతనం చేశారు. వీరిద్దరు కలిసి దాదాపు 45 వైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు రెస్టారెంట్ యాజమాన్యం గుర్తించింది. వైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లడానికి ముందు వీరిద్దరూ అక్కడి ఉద్యోగులతో మాటలు కలపి వారి దృష్టి మళ్లించినట్లు తెలుస్తున్నది. వీరు ఎత్తుకెళ్లిన వైన్ బాటిళ్ల గురించి అక్కడి ఉద్యోగులు ఆరా తీసి.. నోరెళ్లబెట్టారు. ఎందుంకటే వారు దొంగతనం చేసిన వైన్ బాటిళ్లు ఏదో మామూలు వైన్ కాదు. ఏకంగా రూ.3 కోట్ల విలువైన 215 ఏండ్ల కాలం నాటి అరుదైన చాతౌ డి క్విమ్ వైన్ బాటిళ్ దొంగతనం జరిగినట్లు తేల్చారు. అలాగే, ప్రత్యేక రోమనీ-కాంటీ వైన్ తయారీదారు నుంచి 19 వ శతాబ్దానికి చెందిన ఆరు ఇతర బాటిళ్లను కూడా ఆ జంట ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిచెలిన్ రెస్టారెంట్‌కు వచ్చి భోజనం చేసిన ఇంగ్లిష్ మాట్లాడే జంటే ఈ బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నట్లు హోటల్ యజమాని జోస్ పోలో చెప్పారు. రెస్టారెంట్ సిబ్బంది అతిథులకు భోజనం వడ్డిస్తూ బిజీగా ఉన్న సమయంలో సెక్యూరిటీ కెమెరాలను కన్నుగప్పి 40 వేల కంటే ఎక్కువ బాటిళ్లను భద్రపరిచిన హోటల్ సెల్లార్లోకి పరిగెత్తుకుంటూ పోయినట్లు భావిస్తున్నామని అన్నారు. ఈ జంట చెక్ అవుట్ చేసి హోటల్ నుంచి అందరిలాగే కూల్‌గా వెళ్లిపోయారు. ఈ జంట మరొకరి కోసం పనిచేస్తూ ఇలా వైన్ బాటిళ్లను దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి వైన్ బాటిళ్లను ఓపెన్ మార్కెట్లో ఆ జంట అమ్మడం చాలా కష్టమైన పని అని, ఈ బాటిల్స్ ఎక్కడ అమ్మినా ఇదే రెస్టారెంట్వని ఇట్టే పట్టేసే వీలుందని పోలీసులు చెప్తున్నారు.
పాకిస్తాన్ జాతీయ బ్యాంకుపై సైబర్ దాడి
ఇలా చేయడం అంటే.. మోదీ మళ్లీ రోమ్కు వెళ్తాననడమే..!
నీరజ్ చోప్రాకు చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ జెర్సీ
త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..