Space Business: త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
Space Business : అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ త్వరలో భారత్ నుంచి సరికొత్త సవాల్‌ను ఎదుర్కోబోతున్నది. అంతరిక్ష వ్యాపారంలోకి...

న్యూఢిల్లీ : (Space Business) అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ త్వరలో భారత్ నుంచి సరికొత్త సవాల్‌ను ఎదుర్కోబోతున్నది. అంతరిక్ష వ్యాపారంలోకి దిగుతున్న భారతీయ ప్రైవేట్ కంపెనీలు.. స్పేస్ఎక్స్లో సగం ఖర్చుతో ఇస్రో సహకారంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్లోటింగ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ద్రోణా వాయు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపగ్రహ ప్రయోగం నుంచి కక్ష్య వరకు, డాటా ప్రాసెసింగ్, ఇతర సంబంధిత సౌకర్యాల వరకు భారతీయ కంపెనీలు చాలా సరసమైన ధరలకు సేవలను అందించగలవని ఇప్పటికే వెల్లడైంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నుంచి చవకైన శాటిలైట్ లాంచింగ్ ఏజెన్సీ టైటిల్‌ను ఎలోన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్ఎక్స్ కొల్లగొట్టింది.
స్పేస్ఎక్స్ ప్రస్తుతం శాటిలైట్ ప్రయోగంలో కిలోకు 22,000 అమెరికన్ డాలర్లు వసూలు చేస్తున్నది. అయితే, భారతీయ కంపెనీలు కిలోకు 10 వేల అమెరికన్ డాలర్లకే ఆ పని చేయగలవని గతంలోనే నిరూపితమైంది. ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్ష వ్యాపారం 37.5 బిలియన్ డాలర్ల (రూ.2.8 లక్షల కోట్లు) కంటే ఎక్కువగా ఉన్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి తెరతీసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష వ్యాపారానికి పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా మార్కెట్ వర్గాల ద్వారా సమాచారం. ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో 10 శాతమైనా భారతీయ కంపెనీలు కైవసం చేసుకుంటే అదే పెద్ద విజయమని నిపుణులు అంటున్నారు. దాదాపు 350 స్పేస్ కంపెనీలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నది. మన కంటే తక్కువ సంఖ్యలో స్పేస్ కంపెనీలు చైనా, జపాన్, రష్యాలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
40 సంవత్సరాల అనుభవం
భారతీయ కంపెనీలు అంతరిక్ష వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు మొదలెట్టాయని సత్యం కుష్వాహ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ వింగ్ కమాండర్ సత్యం కుష్వాహ తెలిపారు. అయితే, ఈ కంపెనీలు గత నాలుగు దశాబ్దాలుగా ఇస్రోకు సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్‌ను సరఫరా చేస్తున్నాయని, ఇదే గ్లోబల్ స్పేస్ కంపెనీలతో పోటీ పడేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

