ఒక్కసారి వాంతి చేసుకుంటేనే ఎలాగో అవుతుంది. నీరసం వచ్చేస్తుంది. కడుపు మొత్తం తిప్పుతుంది. అలాంటిది ఓ మహిళ రోజుకు కనీసం 70 సార్లు వాంతి చేసుకుంటుంది అంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
ఇంగ్లండ్‌లోని బోల్టన్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ గురించే మనం మాట్లాడుకునేది. తన పేరు లియెన్నె విల్లన్. తనకు 2008 లో వింత జబ్బు సోకింది. ఏది తిన్నా కూడా లోపల ఉండేది కాదు. తినగానే వెంటనే వాంతి చేసుకునేది. దీంతో తనకు డాక్టర్లు వాంతి కాకుండా గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్‌ను అమర్చారు. అప్పటి నుంచి తనకు వాంతులు తగ్గాయి. అయితే.. పేస్‌మేకర్‌ను అమర్చిన రెండేళ్లకే దాన్ని బ్యాటరీ అయిపోయింది.
దీంతో అది పనిచేయడం ఆగిపోయింది. అప్పటి నుంచి మళ్లీ వాంతులు ప్రారంభం అయ్యాయి. ఆ బ్యాటరీలను మార్పించాలన్నా.. కనీసం 10 వేల పౌండ్లు కావాలి. అంటే మన కరెన్సీలో సుమారు 10 లక్షల రూపాయలు. తనకు ఈ వింత జబ్బు సోకినప్పటి నుంచి ఉద్యోగం కూడా మానేయడంతో ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందట.
దీంతో 10 వేల పౌండ్లను సమకూర్చడం కూడా తనకు ఇబ్బందిగా ఉండటంతో ప్రతి రోజు 70 సార్లు వాంతి అవుతోందట. పేస్‌మేకర్ బ్యాటరీని రీప్లేస్ చేయకపోతే.. తనకు వాంతులు తగ్గే అవకాశం లేదని డాక్టర్లు కూడా తెగేసి చెప్పారట.
దీంతో ఇప్పుడు రోజుకు కనీసం 70 సార్లు తిన్నది తిన్నట్టే కక్కేస్తుంది ఆ మహిళ. అలా రోజూ వాంతులు చేసుకుంటూ ఉండటం వల్ల.. తన దగ్గరికి ఎవ్వరూ రావడం లేదట. చివరకు తన కన్న కూతురుకు కూడా ఆ మహిళ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పేస్‌మేకర్ బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుతోంది విల్లన్. ఇప్పటి వరకు 3000 పౌండ్లు సమకూరాయట. ఇంకో 7000 పౌండ్లు సమకూరితే.. తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
హలో.. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ
వార్నీ.. ఏడాది వయసు లేదు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బుడ్డది.. వైరల్ వీడియో
పెయిన్ కిల్లర్ అనుకొని ఎయిర్‌పాడ్‌ను మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?