రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం | మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి. సడెన్‌గా రోడ్డు మీద డబ్బుల నోట్లు కనిపిస్తే ఏం చేస్తారు. ఎటు చూసినా.. కరెన్సీ కనిపిస్తే ఆగుతారా
మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి. సడెన్‌గా రోడ్డు మీద డబ్బుల నోట్లు కనిపిస్తే ఏం చేస్తారు. ఎటు చూసినా.. కరెన్సీ కనిపిస్తే ఆగుతారా.. వెంటనే వాహనం దిగి.. ఆ డబ్బులను ఏరుకోరు. ఎవరికైనా డబ్బు చేదు కాదుకదా. అయినా.. రోడ్ల మీద డబ్బులను ఎవరు వదిలేస్తారు. డబ్బులను ఎవరైనా వెదజల్లుతారా? అనే డౌట్ మీకు ఇప్పటికే వచ్చి ఉండొచ్చు.

కానీ.. ఓ రోడ్డు మీద నిజంగానే నోట్ల వర్షం కురిసింది. అక్కడ ఎటు చూసినా.. కరెన్సీ నోట్లే కనిపించాయి. దీంతో ఆ రోడ్డు మీద వెళ్లే జనాలు షాక్ అయ్యారు. వెంటనే తమకు దొరికినంత ఏరుకున్నారు. ఈ ఘటన యూఎస్‌లోని సాన్ డియెగోలో చోటు చేసుకుంది.
ఓ ట్రక్.. డబ్బుల కట్టలతో లోకల్ బ్యాంక్ నుంచి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్తోంది. మధ్యలో ట్రక్ వెనుక ఉన్న డోర్ ఓపెన్ అయింది. దీంతో బ్యాగుల్లో ఉన్న క్యాష్ మొత్తం రోడ్లు మీద చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ విషయాన్ని ట్రక్ డ్రైవర్ గమనించలేదు. కానీ.. వెనుక బైక్స్, కార్లలో వస్తున్న వాళ్లు గమనించి.. తమ వాహనాలను ఆపేసి మరీ.. వాటిని ఏరుకోవడం మొదలు పెట్టారు.
ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ట్రక్ డ్రైవర్.. ట్రక్‌ను ఆపి.. రోడ్డు మీద పడిపోయిన క్యాష్‌ను ట్రక్‌లో వేయడం ప్రారంభించాడు. అప్పటికే కొందరు తమకు దొరికినంత జేబుల్లో, డ్రెస్సులలో దాచుకొని అక్కడి నుంచి ఉడాయించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కొందరు తాము ఏరుకున్న నోట్లను పోలీసులకు అప్పగించి వెళ్లగా.. మరికొందరు మాత్రం ఆ డబ్బులతో అక్కడి నుంచి జంప్ అయ్యారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెమి బాగ్బై అనే యువతి.. రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిఉన్న డబ్బుల వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హలో.. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ
వార్నీ.. ఏడాది వయసు లేదు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బుడ్డది.. వైరల్ వీడియో
పెయిన్ కిల్లర్ అనుకొని ఎయిర్‌పాడ్‌ను మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
రోడ్డు మీద పులుల గుంపు హల్చల్.. అవి నడుస్తుంటే వాటి వీడియో తీసి.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

