హలో.. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ
నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్ | హలో.. సార్. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదండి. మీరే ఎలాగైనా నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడేలా చేయండి.
హలో.. సార్. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదండి. మీరే ఎలాగైనా నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడేలా చేయండి. అతడు నాతో మాట్లాడకుంటే నేను ఉండలేనండి.. అంటూ ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో చోటు చేసుకుంది.

ఛింద్వారాకు చెందిన ఓ మహిళకు సరానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య సంబంధానికి దారి తీసింది. అయితే.. ఇటీవల ఆ వ్యక్తి పుట్టిన రోజు వచ్చింది. ఆరోజు ఆ మహిళ.. అతడికి విష్ చేయలేదని.. గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది.
అప్పటి నుంచి ఆ వ్యక్తి.. ఆ మహిళతో మాట్లాడటం లేదు. దీంతో బెంగ పెట్టుకున్న ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా రోజుల పాటు అతడు మాట్లాడుతాడేమోనని వేచి చూసింది కానీ.. అతడు మాత్రం మొహం చాటేశాడు.
దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి.. తన బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత.. ఇరు కుటుంబ సభ్యుల ఒప్పందంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. అలా.. తన పెళ్లితో శుభం కార్డు పడిందన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వార్నీ.. ఏడాది వయసు లేదు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బుడ్డది.. వైరల్ వీడియో
పెయిన్ కిల్లర్ అనుకొని ఎయిర్‌పాడ్‌ను మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
రోడ్డు మీద పులుల గుంపు హల్చల్.. అవి నడుస్తుంటే వాటి వీడియో తీసి.. వైరల్ వీడియో
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

