World’s Richest Dog : రూ.238 కోట్ల ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన కుక్క.. దానికి అంత ఆస్తి ఎక్కడిదో తెలుసా?
రూ.238 కోట్ల ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిన కుక్క | ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అంటే ఎవరు ఉంటారు చెప్పండి మనుషులే కదా. జంతువులకు ఆస్తులు ఎక్కడ ఉంటాయి
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అంటే ఎవరు ఉంటారు చెప్పండి మనుషులే కదా. జంతువులకు ఆస్తులు ఎక్కడ ఉంటాయి. వాటికి సంపాదన మీద యావే ఉండదు. డబ్బులు సంపాదించే అవసరం కూడా జంతువులకు ఉండదు. కానీ.. ఓ కుక్క మాత్రం ప్రపంచంలోనే అత్యంత రిచ్ డాగ్. దాని దగ్గర రూ.238 కోట్ల ప్రాపర్టీ ఉంది అంటే నమ్ముతారా? ఆశ్చర్యపోతున్నారు కదా.. పదండి.. ఆ రిచ్ డాగ్ కథేంటో తెలుసుకుందాం.

ఆ కుక్క పేరు గుంతర్ 6. తనకు 500 మిలియన్ డాలర్ల సంపద వారసత్వంగా వచ్చింది. తన ముత్తాత అయిన కుక్క పేరు గుంతర్ 4 నుంచి ఆ ఆస్తి తనకు లభించింది. గుంతర్ 4 కు తన తండ్రి గుంతర్ 3 నుంచి ఆ ఆస్తి వచ్చింది. గుంతర్ 3 58 మిలియన్ డాలర్ల ఆస్తి.. తన ఓనర్ కర్లొట్టా ద్వారా సంభవించింది. కర్లొట్లా గుంతర్ 3ని పెట్ డాగ్‌గా పెంచుకుంది. తనకు ఎవ్వరూ లేరు. దీంతో తను మరణించాక తన ఆస్తి.. గుంతర్ 3కి చెందాలని వీలునామా రాసి 1992 లో కర్లొట్టా చనిపోయింది. దీంతో అప్పటి నుంచి తన ఆస్తిని గుంతర్ వారసులకు చెందేలా కర్లొట్టా తరుపు లాయర్లు చూసుకున్నారు.
గుంతర్ 3 తర్వాత ఇప్పుడు గుంతర్ 6 ఆ ఆస్తిని అనుభవిస్తోంది. ప్రస్తుతం యూఎస్‌లోని మియామీలో ఉన్న పెద్ద బంగ్లా గుంతర్ 6 పేరు మీదే ఉంది. దాని విలువ మన కరెన్సీలో రూ.238 కోట్లు. ఇప్పుడు ఆ ఇంటిని గుంతర్ 6 వేలం వేసింది.
1928 లో ఆ బంగ్లాను నిర్మించారు. 9 బెడ్రూమ్స్, 8 బాత్రూమ్స్, ఒక అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఆ బంగ్లాను వేలం వేశారు. దాన్ని అమ్మిపెట్టేందుకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో గుంతర్ తరుపు లాయర్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే.. ఆ ప్రాపర్టీ ఓనర్ ఓ కుక్క అని తెలుసుకొని.. ఆ కంపెనీ ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికి వేలంలో ఉన్న ఆ బంగ్లాను దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

