రోడ్డు మీద పులుల గుంపు హల్చల్.. అవి నడుస్తుంటే వాటి వీడియో తీసి.. వైరల్ వీడియో
రోడ్డు మీద పులుల గుంపు హల్చల్ | ఎప్పుడైనా రోడ్డు మీద పులుల గుంపు నడుస్తూ వెళ్లడం చూశారా? అసలు.. ఒక్క పులిని చూడటమే గొప్ప.
ఎప్పుడైనా రోడ్డు మీద పులుల గుంపు నడుస్తూ వెళ్లడం చూశారా? అసలు.. ఒక్క పులిని చూడటమే గొప్ప. అటువంటిది పులుల గుంపును చూసే అదృష్టం కూడానా అంటారా? కానీ.. ఈ వీడియోలో పులుల గుంపునే చూడొచ్చు. ఈ అరుదైన దృశ్యం.. మహారాష్ట్రలో కనిపించింది.

నాగ్‌పూర్ దగ్గర ఉన్న ఉమ్రెద్ కర్హండ్ల వైల్డ్‌లైఫ్ సాంక్చువరీలో ఉన్న పులుల గుంపు ఒక్కసారిగా లోపల వాహనాలు తిరిగే రోడ్డు మీదికి వచ్చాయి. ఓ వ్యక్తి వాటిని గమనించి వాటి ముందు వెళుతూ.. వాటిని వీడియో తీశాడు. ఆ వీడియోను బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హూడా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్లు అయితే.. ఆ పులులను చూసి తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పులులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. ఒకేసారి ఇన్ని పులులను చూడటం ఇదే మొదటిసారి. భవిష్యత్తులో పులుల గురించి చదువుకోవడమే కానీ.. చూడం కావచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Chappar Phad ke ..
— Randeep Hooda (@RandeepHooda) November 19, 2021
Umrer – karhandla
VC : WA forward pic.twitter.com/qrQUb4Jk5P
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

