ఓ మహిళ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోబోయి యాపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేసింది. ఎయిర్‌పాడ్‌ను మింగిన తర్వాత కానీ.. తనకు తెలియలేదు.. తాను టాబ్లెట్ వేసుకోకుండా.. ఎయిర్‌పాడ్‌ను మింగానని.
27 ఏళ్ల కార్లి బెల్లెర్.. టిక్ టాక్‌లో ఓ వీడియోను షేర్ చేసి.. తనకు జరిగిన ఆ వింత అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంది. నేను నా ఎడమ ఎయిర్‌పాడ్‌ను మింగేశా. దాన్ని వాంతి చేసుకొని బయటికి తీయాలనుకున్నా కుదరలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేసింది కార్లి.
తను ఐబుప్రోఫెన్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం కోసం దాన్ని చేతుల్లో వేసుకుంది. ఆ తర్వాత తన మరో చేతిలో ఎయిర్‌పాడ్ ఉంది. ఒక చేతిలో టాబ్లెట్.. మరో చేతిలో ఎయిర్‌పాడ్. దీంతో కన్ఫ్యూజ్ అయిపోయి.. ఎయిర్‌పాడ్‌ను మింగేసింది. ఆ తర్వాత మరో చేతిలో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్‌ను చూసి షాక్ అయింది కార్లి.
తన కడుపులో ఉన్న ఎయిర్‌పాడ్ కూడా ఫోన్‌తో కనెక్ట్ అయి వాయిస్‌ను బయటికి పంపించింది కానీ.. ఆ వాయిస్ స్పష్టంగా లేదు. ఎలాగైనా ఆ ఎయిర్‌పాడ్‌ను బయటికి తీయాలనుకొని.. ఎన్నో ప్రయత్నాలు చేసింది కార్లి. వాంతులు చేసుకున్నా అది బయటికి రాలేదు. చివరకు అది తన మలంతో పాటు బయటికి వచ్చింది. దీంతో తను ఉపశమనం పొందింది.
ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి తను స్కానింగ్ చేయించుకుంటే.. కడుపులోని ఎయిర్‌పాడ్ బయటికి వెళ్లిపోయినట్టు డాక్టర్లు కన్ఫమ్ చేశారు.
నేను దాన్ని మలం ద్వారా బయటికి పంపించాను. కానీ.. దాన్ని నేను తిరిగి తీసుకోలేదు. ఇక దాని అవసరం నాకు లేదు. వెంటనే వేరే ఎయిర్‌పాడ్స్ తీసుకున్నాను.. అని వీడియోలో చెప్పుకొచ్చింది కార్లి. ప్రస్తుతం కార్లి వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. పెయిన్ కిల్లర్‌కు, ఎయిర్పాడ్కు నీకు తేడా తెలియలేదా? అయినా అంత పెద్దగా ఉన్న ఎయిర్‌పాడ్‌ను ఎలా మింగేశావు.. నువ్వు గ్రేట్ తల్లి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోడ్డు మీద పులుల గుంపు హల్చల్.. అవి నడుస్తుంటే వాటి వీడియో తీసి.. వైరల్ వీడియో
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు