11 నెలల వయసు ఉన్న చిన్నారి ఏం చేస్తుంది చెప్పండి. తల్లి ఒడిలో పడుకొని తల్లి పాలు తాగుతూ.. హాయిగా నిద్రపోతూ.. ఆడుకుంటూ ఉంటుంది. కానీ.. ఈ చిన్నారి మాత్రం అందరికంటే డిఫరెంట్.. 11 నెలలకే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌లో ఉన్న చోంగ్లికి చెందిన వాంగ్ యుజి ఇప్పుడు మంచులో విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడాది వయసు లేదు కానీ.. ఆ బుడ్డది చేసే విన్యాసాలు చూస్తే ఔరా అనాల్సిందే.
మంచులో స్కేటింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది వాంగ్ యుజి. అంతే కాదు.. 2022లో చైనాలో నిర్వహించబోయే వింటర్ ఒలింపిక్స్‌కు రెడీ అవుతోంది. ప్రాక్టీస్ చేస్తోంది. 2022లో కప్ కొట్టడమే లక్ష్యంగా స్కేటింగ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే అతి చిన్న వయసులో స్కేటింగ్ చేస్తూ చైనాలో రికార్డ్ సాధించింది ఈ బుడ్డది. త్వరలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొని మరో రికార్డు క్రియేట్ చేయడానికి సన్నద్ధం అవుతోంది.
తనకు స్నోబోర్డింగ్‌లో శిక్షణ ఇచ్చి.. తన వెంటే ఉంటూ తనకు ప్రాక్టీస్ చేయిస్తున్నారు వాంగ్ తల్లిదండ్రులు. వామ్మో.. సంవత్సరం వయసు కూడా లేదు కానీ.. ఈ బుడ్డది చేసే విన్యాసాలు, రికార్డులు చూశారా? తను స్కేటింగ్ చేస్తున్న వీడియోను కూడా చూసేయండి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెయిన్ కిల్లర్ అనుకొని ఎయిర్‌పాడ్‌ను మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
రోడ్డు మీద పులుల గుంపు హల్చల్.. అవి నడుస్తుంటే వాటి వీడియో తీసి.. వైరల్ వీడియో
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?