Iran | భారత మిత్రులకు ఆందోళన అక్కర్లేదు.. హామీ ఇచ్చిన ఇరాన్
Iran | ఇజ్రాయెల్, అమెరికా (Israel-US) తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకల రాకపోకలపై గత కొన్నాళ్లుగా ఇరాన్ (Iran) ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. 'భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
Iran : ఇజ్రాయెల్, అమెరికా (Israel-US) తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకల రాకపోకలపై గత కొన్నాళ్లుగా ఇరాన్ (Iran) ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. ‘భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వారు సురక్షితంగా ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన చేసింది. ఈ భరోసాతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.
ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణా జరిగే హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాతో వివాదం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గంలో రాకపోకలను దాదాపు నిలిపివేసింది. అయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇరాన్ స్పష్టంచేసింది. ఈ దిగ్బంధనంవల్ల భారత్ సహా పలుదేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే 8 భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. వీటిలో BW TYR, BW ELM అనే రెండు ఎల్పీజీ క్యారియర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 94 వేల టన్నుల ఎల్పీజీ భారత్‌కు చేరింది. అయితే భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ, ముడిచమురు, ఎల్ఎన్జీతో కూడిన మరో 19 నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా ఈ వివరాలు వెల్లడించారు.
చిక్కుకున్న నౌకల్లో భారత్‌కు చెందినవి 9 ఉండగా.. విదేశీ జెండాలతో భారత్‌కు వస్తున్నవి 10 ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు జలసంధిలో నిలిచిపోయినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

