న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెటర్ నువాన్ తుషార(Nuwan Thushara) కోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కొలంబో జిల్లా కోర్టులో అతను కేసు దాఖలు చేశాడు. ఐపీఎల్లో ఆడే హక్కును కల్పించాలని లంక కోర్టును అతను కోరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు లంక క్రికెట్ బోర్డు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఫిట్నెస్ సరిగా లేని కారణంగా తుషారకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డు తిరస్కరించింది. దీంతో ఐపీఎల్లో ఆడేందుకు అతనికి క్లియరెన్స్ దక్కలేదు. వాస్తవానికి 31 ఏళ్ల క్రికెటర్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ లంక బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు అతను కోర్టును ఆశ్రయించాడు. ఏప్రిల్ 9వ తేదీన ఈ కేసుపై విచారణ జరగనున్నది.