దొంగతనాలు సాధారణంగా రాత్రుళ్లు జరుగుతుంటాయి. దీంతో పగలు దర్జాగా ఎటువంటి భయం లేకుండా జనాలు బయట తిరుగుతారు. కానీ.. ఈ మధ్య చైన్ స్నాచింగ్స్ ఎక్కువైపోయాయి. పట్ట పగలు.. నడి రోడ్డు మీద.. బైక్ మీద వచ్చి చైన్ స్నాచ్ చేసే ముఠాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా జల్సాలకు అలవాటు పడిన యువకులే చైన్ స్నాచింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న, లేదా స్కూటీ మీద వెళ్తున్న మహిళలను, యువతులను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాళ్లు తేరుకునేలోపే.. బైక్‌పై ఉడాయిస్తున్నారు.
తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. స్కూటీ మీద వెళ్తున్న ఓ మహిళను ఆపి.. జేబులో నుంచి గన్ తీసి.. పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టి.. ఆమె మెడలో నుంచి చైన్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను చూసి.. అక్కడి స్థానికులు, రోడ్డు మీద వెళ్లేవాళ్లు షాక్ అయ్యారు. ఆ మహిళ తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
#WATCH | Madhya Pradesh: Two bike-borne miscreants snatch chain from a woman in Gwalior, in broad daylight pic.twitter.com/dHnvfp2dr8
— ANI (@ANI) August 26, 2021
తన కొడుకును ట్యూషన్ సెంటర్లో దించేందుకు ఆ మహిళ.. స్కూటీ మీద వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి