తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
17 వేల బిల్ పంపించిన నవ వధువు | ఓ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా? తన పెళ్లి రిసెప్షన్‌కు రాలేదని.. ఓ వ్యక్తిని 17 వేల రూపాయల ఫైన్
చాలామంది తమ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తారు. తప్పకుండా రావాలంటారు. ఎలాగైనా వీలు చూసుకొని రావాలని కోరుతారు. దానికి మనం ఏం అంటాం. తప్పకుండా వస్తాం.. అని చెబుతాం. కానీ.. పెళ్లి రాము… అని ఎవ్వరూ అనరు.

అయితే.. ఓ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా? తన పెళ్లి రిసెప్షన్‌కు రాలేదని.. ఓ వ్యక్తిని 17 వేల రూపాయల ఫైన్ వేసింది. 17 వేల రూపాయల బిల్లును పంపించింది. దీంతో ఆ అతిథి షాక్ అయ్యాడు.
ఆ అతిథి.. ఖచ్చితంగా తన పెళ్లికి వస్తానని మాటిచ్చాడట. జంటగా వస్తామని మాటివ్వడంతో.. ఇద్దరి కోసం రెండు సీట్లను రిజర్వ్ చేసిందట పెళ్లికూతురు. రెండు సీట్లను రిజర్వ్ చేసినందుకు.. ఒక్క సీటుకు 120 డాలర్ల చొప్పున.. 240 డాలర్లను వెచ్చించి మరీ.. ఆ రెండు సీట్లను రిజర్వ్ చేస్తే.. చివరకు వాళ్లు తన పెళ్లి రిసెప్షన్‌కు రాలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు.. ఆ వ్యక్తి.. రెండు సీట్లను రిజర్వ్ చేయడం కోసం అయిన ఖర్చు 240 డాలర్లు.. అంటే మన కరెన్సీలో 17,700 రూపాయల బిల్లును అతడికి పంపించింది.
నువ్వు కనీసం రిసెప్షన్‌కు రావడం లేదని కూడా సమాచారం ఇవ్వలేదు. రిసెప్షన్ ముందు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. రిసెప్షన్‌కు రాకుండా ఎగ్గొట్టావు. నీ కోసం రిజర్వ్ చేసిన సీట్ల కోసం చెల్లిన డబ్బులను వెంటనే చెల్లించు. జెల్లే లేదా పేపాల్.. ఏదైనా పర్వాలేదు.. ఏ పేమెంట్ పద్ధతి ద్వారా అయినా చెల్లించు.. అంటూ ఇన్వాయిస్తో పాటు.. ఒక నోట్‌ను కూడా పంపించింది ఆ నవ వధువు.
ఆ వధువు పంపించిన బిల్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అయితే తమకు తోచిన విధంగా ఆ బిల్లుపై స్పందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- bill
- bride
- trending
- wedding guest
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

