Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి | ఓ ఐఏఎస్ ఆఫీసర్.. కూరగాయలు అమ్మాడు. ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు
ఓ ఐఏఎస్ ఆఫీసర్.. కూరగాయలు అమ్మాడు. ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి.. కూరగాయలు అమ్మాల్సిన అవసరం ఆయనకేంది.. అంటారా? పదండి.. ఓసారి యూపీకి వెళ్లి వద్దాం.

ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా.. యూపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే.. ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఫేస్బుక్ వాల్లో ఆ ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటోలో రోడ్డు పక్కన కూరగాయల కొట్టు దగ్గర కింద కూర్చొని అఖిలేష్ కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అది నిజమా? లేక ఫేకా? అని కామెంట్లు చేశారు.

చివరకు ఆ ఫోటో గురించి అఖిలేష్ మిశ్రానే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది తానేనని.. అక్కడ కూరగాయలు అమ్మింది కూడా నిజమేనని.. తాను ప్రయాగ్‌రాజ్‌కు ఆఫీసు పని మీద వెళ్లినప్పుడు.. అక్కడ మార్కెట్లో ఆగి కూరగాయలు కొన్నానని చెప్పాడు. అయితే.. కూరగాయలు అమ్మే ఓ మహిళ కాసేపు తన కూరగాయల బండి దగ్గర కూర్చోవాలని అఖిలేష్‌ను అడగడంతో.. కాదనలేక.. కాసేపు అక్కడ కూర్చున్నాడట. అదే సమయంలో కస్టమర్లు రావడంతో.. వాళ్లకు కూరగాయలు అమ్మాడట. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో చెప్పుకొచ్చాడు.

కస్టమర్లకు కూరగాయలు అమ్ముతుండగా.. తన ఫ్రెండ్ ఫోటో తీసి.. అఖిలేష్ ఫోన్ తీసుకొని ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడట. ఆ ఫోటోను తన ఫ్రెండ్ ఫేస్బుక్లో పెట్టిన విషయం కూడా తనకు తెలియదని.. తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అప్పుడే చూశా.. అని చెప్పుకొచ్చాడు అఖిలేష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Shopping List : హహహ.. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా?
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Viral Photo : పోలీస్‌కు మహిళ రాఖీ కడుతుంటే.. లాకప్‌లో ఉన్న వ్యక్తి ఏం చేశాడో చూడండి
Kid Cudi : అమెరికన్ ర్యాపర్ ‘కిడ్ కుడి’ భావోద్వేగ పోస్ట్ వైరల్
Selling Farts : పిత్తులు అమ్మి రూ.18.5 లక్షలు సంపాదించిన మహిళ
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

