మామూలుగా డ్రోన్స్‌తో షూట్ చేసిన వీడియోలు చూసుంటారు. కానీ.. ఒక పక్షి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఫోన్‌తో వీడియో షూట్ చేస్తే ఎలా ఉంటది. అసలు.. ఎప్పుడైనా పక్షి వ్యూను మనం చూశామా? చూడలేదు కదా.. కానీ.. ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే.. ఓ పక్షి ఫోన్‌ను దొంగలించి ఎగురుకుంటూ వెళ్తుండగా.. ఆ ఫోన్ కెమెరా ఆన్ అయింది. దీంతో వీడియో రికార్డు అయింది.
ఓ వ్యక్తి ఫోన్‌ను లాక్కెళ్లిన రామచిలుక దాన్ని కాలి గోళ్లతో ఫోన్‌ను పట్టుకుంది. అదే సమయంలో.. ఫోన్ కెమెరా ఆన్ అయి రికార్డవడం స్టార్ట్ అయింది. ఇక అది ఎగురుకుంటూ ఇళ్ల మీద నుంచి వెళ్లింది. కాసేపు అటూ ఇటూ తిరిగి చివరకు ఓ కారు మీద ఆగింది. అప్పుడు కానీ.. ఆ ఫోన్ రికార్డింగ్ ఆగలేదు.
మొత్తం మీద చిలుక ట్రిప్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రోన్‌ను మించిన వీడియో ఇది. సూపర్బ్.. పక్షుల పైన ఎగురుతూ వెళ్తుంటే.. కింద వ్యూ అలా ఉంటుందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.