ఈ పండు చాలా కాస్లీ గురూ.. ధర కలలో ఊహించి ఉండరు..!
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, మామిడి, లీచీలు తదితర పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటి ధరలు కిలో వంద నుంచి మహా అయితే.. రూ.వెయ్యి వరకు ఉంటుంది. కానీ, ఏ పండు అయినా కిలో రూ.లక్షల్లో ఉంటుందని ఊహించి ఉండరు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఒకటి ఉంది. ధనవంతులు తప్ప సామాన్యులకు అందనంతగా.. వజ్రాల కంటే ఖరీదైంది.

ఈ పండు కొని తినే బదులు బంగారం, భూములపై పెట్టుబడి పెట్టడం నయం అనుకుంటారు.. ఇటీవల ఈ పండ్లను జపాన్లో వేలం వేశారు. ఈ పండు కేవలం జపాన్లో మాత్రమే దొరుకుతుంది. అదే యుబారి పుచ్చకాయ (Yubari Melon). ఈ పండును జపాన్లో సాగు చేసి అక్కడ విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు, రెస్టారెంట్ యజమానులకు సౌలభ్యం కోసం ఈ పండును చిన్న చిన్న పరిమాణాల్లో విక్రయిస్తుంటారు. ఈ పండు ఎగుమతి చేయడం చాలా తక్కువ. ఇది సూర్యకాంతిలో కాకుండా గ్రీన్హౌస్లో పెరుగుతుంది. జపాన్లో దొరికే యుబారి కస్తూరి పుచ్చకాయ ఖరీదు రూ.పది లక్షలు ఉంటుంది. 2019 సంవత్సరంలో ఈ పుచ్చకాయలను రూ.33లక్షలకు వేలం వేశారు. లోపల నారింజ రంగులో ఉండి.. తియ్యగా ఉంటుంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

