అతడి పేరు ప్రతిక్ విట్టల్ మోహితె. ఎత్తు 102 సెంటీమీటర్లు. అంటే కేవలం 3 ఫీట్ల 4 ఇంచులు. ప్రస్తుతం ప్రతిక్.. అత్యంత తక్కువ పోటీ కలిగిన బాడీబిల్డర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. 2012లో బాడీబిల్డింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ప్రతిక్.. ఎంతో కష్టపడి బాడీబిల్డర్‌గా ఎదిగాడు.
2016లో కాంపిటిటివ్ ఈవెంట్లో మొదటిసారి పార్టిసిపేట్ చేశాడు ప్రతిక్. అప్పటి నుంచి 40 ఈవెంట్స్‌లో పాల్గొన్నాడు. అత్యంత తక్కువ పోటీ కలిగిన బాడీబిల్డర్‌గా చరిత్రకెక్కాడు ప్రతిక్. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
ప్రతి రోజు ఇప్పటికీ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ.. తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు ప్రతిక్. రోజూ 30 నిమిషాల పాటు పరిగెత్తడం, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్, స్పెషల్ డైట్ ఫుడ్, 2 గంటలు జిమ్.. చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ప్రతిక్.
భవిష్యత్తులో సొంత జిమ్‌ను ఏర్పాటు చేసి నాలాంటి వారు ఎందరినో తీర్చిదిద్దాలనేదే నా సంకల్పం. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనేది నా లక్ష్యం. అది నెరవేరింది. నిమిషంలో రికార్డు స్థాయిలో పుషప్స్ చేసి మరో రికార్డు నెలకొల్పాలనేది మరో లక్ష్యం అని ప్రతిక్ చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : ఒక క్వార్టర్ అంటే ఎంత?.. స్టూడెంట్ సమాధానానికి బిత్తరపోయిన ప్రొఫెసర్
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్