మీకు గుర్తుందా? ఇన్స్టాంట్ నూడుల్స్ మ్యాగీతో పానీపూరీ చేశారు.. ఓరియో మ్యాగీ చేశారు.. చాకొలేట్ మ్యాగీ చేశారు.. మ్యాగీతో లడ్డూలు కూడా చేశారు. ఇక మ్యాగీతో మిల్క్‌షేక్ చేశారు తాజాగా. దానికి మ్యాగీ మిల్క్‌షేక్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మ్యాగీ మిల్క్‌షేక్ గురించే చర్చ.
చాలామంది చెఫ్‌లు ఇలాంటి వింత వంటకాలపై ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొన్ని సక్సెస్ అవుతాయి. మరికొన్ని సక్సెస్ కావు. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మ్యాగీ మిల్క్షేక్పై నెటిజన్లు మాత్రం తీవ్రంగా ఆగ్రహానికి గురవుతున్నారు.
See what I found…
— Shweta Gupta🌸 (@ShwetaGup001) September 11, 2021
Chef hai ye toh 🤣@mayursejpal https://t.co/AJRQdnssnu pic.twitter.com/yzXAgNypJY
మీకు ఏం పని ఉండదా? ఎలా పడితే అలా వండేస్తారా? దీన్ని వండినోడు.. ఎవడో నా దగ్గరికి తీసుకురండి.. ఇలా చేస్తే పాపం తగులుతుంది.. అంటూ ఇలా నెటిజన్లు మాత్రం ఆ రెసిపీ మీద తెగ ఫైర్ అవుతున్నారు.
https://t.co/GAQnI8daUw pic.twitter.com/Bx2hqPMbnN
— શ્રીરાજ 🇮🇳 (@s84_yqr) September 11, 2021
ఇంకో యూజర్ మాత్రం.. మ్యాగీ మిల్క్‌షేక్‌ను తయారు చేస్తున్న వీడియోను వెతికి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. మొత్తం మీద మ్యాగీ మిల్క్‌షేక్ ప్రయోగం బెడిసికొట్టింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం మరోసారి మ్యాగీతో చేసే వంటకాల గురించి చర్చ మొదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Viral Video : పెళ్లి కాగానే.. వధువు ఆశీర్వాదం తీసుకున్న వరుడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Viral Video : అక్కడ జరిగింది ట్రక్ యాక్సిడెంట్.. కానీ ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేరు