హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లిలో వధువు.. వరుడి కాళ్లకు మొక్కుతుంది. వధువు… వరుడి కాళ్లకు దండం పెడుతుంటే.. వరుడు ఆశీర్వదిస్తాడు. ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్న ఆచారం. పెళ్లిలోనే కాదు.. పెళ్లి తర్వాత కూడా పలు సందర్భాలలో భార్య.. భర్త కాళ్లకు దండం పెట్టడం.. భర్త నుంచి ఆశీర్వాదం తీసుకోవడం చూస్తుంటాం.
కానీ.. ఓ పెళ్లి కొడుకు మాత్రం.. పెళ్లి కాగానే.. తన భార్య కాళ్ల మీద పడ్డాడు. తన కాళ్లను పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లి కూతురు.. తన భర్త కాళ్ల మీద పడబోతుండగా.. అతడు అడ్డుకొని.. రివర్స్‌లో ఆమె కాళ్ల మీద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లికూతురు షాక్ అయింది. వెంటనే వెనక్కి జరిగింది. తన కాళ్లను వెనక్కి జరిపింది.
ఇది.. మ్యూచువర్ రెస్పెక్ట్ అంటే.. ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఇటువంటి వాళ్లే తమ వివాహ బంధాన్ని పటిష్ఠంగా ఉంచుకుంటారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నెటిజన్లు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. భార్యను భర్త.. భర్తను భార్య అర్థం చేసుకున్నప్పుడే ఆ వివాహ బంధం నూరేళ్లు కొనసాగుతుందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : అక్కడ జరిగింది ట్రక్ యాక్సిడెంట్.. కానీ ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేరు
Free Pani Puri : రూ.40 వేల విలువైన పానీపూరీని ఉచితంగా పంచాడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు
Viral Video : యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చూస్తూ.. ఈ పిల్లి చేసిన చేష్టలకు వావ్ అనాల్సిందే
Viral Video : తండ్రి పిజ్జా ఆర్డర్ చేశాడు.. పిజ్జాను ఓపెన్ చేయగానే పిల్లాడు ఏం చేశాడో చూడండి