రోడ్ల మీద ప్రమాదాలు సాధారణమే. ఒక్కోసారి వేరే వాహనం వచ్చి మరో వాహనాన్ని ఢీకొడుతుంది. అలా కాకుండా.. కొన్ని వాహనాలు ఓవర్ స్పీడ్ వల్ల… డ్రైవర్ అజాగ్రత్త వల్ల వాటికవే ప్రమాదానికి గురవుతుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడయోలో ట్రక్ దానికదే చేసుకున్న యాక్సిడెంట్. భారీ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్.. టర్నింగ్ వద్దకు రాగానే.. ఒక వైపు ఒరిగింది. అలాగే కింద పడిపోయింది. ట్రక్ బాడీ పార్ట్స్ మొత్తం కింద పడిపోగా.. టైర్లతో ఉన్న పార్టు అలాగే ముందుకు వెళ్లిపోయింది.
రోడ్డు మీద అలాగే.. ట్రక్ టైర్ల పార్ట్ వెళ్లిపోతుండటంతో.. ఆ ట్రక్ డ్రైవర్ వెంటనే లేచి.. దాని వెనుక పరిగెత్తాడు. ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు.. ఆ వీడియోను చూసి వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. శరీరాన్ని త్యాగం చేసి ఆత్మ బయటికి వెళ్లిపోయింది.. అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. అయితే.. ఈ వీడియోను చూసి.. అయ్యో.. అనే వాళ్ల కన్నా.. నవ్వుకున్న వాళ్లే ఎక్కువ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Free Pani Puri : రూ.40 వేల విలువైన పానీపూరీని ఉచితంగా పంచాడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు
Viral Video : యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చూస్తూ.. ఈ పిల్లి చేసిన చేష్టలకు వావ్ అనాల్సిందే
Viral Video : తండ్రి పిజ్జా ఆర్డర్ చేశాడు.. పిజ్జాను ఓపెన్ చేయగానే పిల్లాడు ఏం చేశాడో చూడండి
Viral Video : పెళ్లి మండపంలో పెళ్లికూతురును చూసి పెళ్లికొడుకు షాక్.. ఎందుకంటే?