Free Pani Puri : రూ.40 వేల విలువైన పానీపూరీని ఉచితంగా పంచాడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు
రూ.40 వేల విలువైన పానీపూరీని ఉచితంగా పంచాడు | అతడు పానీపూరీ అమ్ముకునే వ్యక్తి. సాధారణ వ్యక్తే. రోజుకు ఆదాయం కూడా అంతంత మాత్రమే. కానీ.. గత ఆదివారం
అతడు పానీపూరీ అమ్ముకునే వ్యక్తి. సాధారణ వ్యక్తే. రోజుకు ఆదాయం కూడా అంతంత మాత్రమే. కానీ.. గత ఆదివారం.. ఏకంగా 40 వేల రూపాయల విలువైన పానీపూరీని అందరికీ పంచాడు. అందరికీ ఉచితంగా పానీపూరీని ఆఫర్ చేశాడు. అయితే.. ఆ వ్యక్తి అలా ఉచితంగా పానీపూరీని పంచడం వెనుక మంచి కారణమే ఉంది.. అదేంటో తెలుసుకుందా రండి.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న కోలార్ అనే ప్రాంతంలో పానీపూరీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు అంచల్ గుప్తా. అయితే.. గత ఆదివారం భోపాల్‌లోని స్థానికులకు ఉచితంగా పానీపూరీని అందించాడు. సుమారు 40 వేల రూపాయల విలువైన పానీపూరీని ఉచితంగా ఆఫర్ చేయడంతో.. అక్కడి స్థానికులంతా ఎగబడి మరీ పానీపూరీని తిన్నారు.

మరి.. అంత డబ్బు పెట్టి ఉచితంగా పానీపూరీ ఎందుకు పంచాడంటారా? తనకు ఇటీవలే కూతురు పుట్టిందట. తనకు కూతురు అంటే చాలా ఇష్టం అట. తనకు పెళ్లయ్యాక ముందు కూతురు కావాలని అనుకున్నాడట కానీ.. తనకు కూతురు కాకుండా.. కొడుకు పుట్టాడట. రెండో కాన్పులో కూతురు పుట్టేసరికి.. తన ఆనందాన్ని ఆపుకోలేక.. ఇలా పానీపూరీని ఉచితంగా ఆఫర్ చేశాడు.

అలాగే.. ఆడపిల్లలంటే తక్కువ చేసి చూసే ఈ సమాజంలో.. ఆడపిల్లలు ఏం తక్కువ కాదని నిరూపించడం కోసమే తాను ఈ సెలబ్రేషన్స్ చేశానని అంచల్ చెప్పుకొచ్చాడు. కూతురు పుడితే చూడటానికి కూడా రాని తండ్రులు ఉన్న ఈ సమాజంలో.. కూతురు పుట్టడంతో పండుగలా జరుపుకొని.. కోలార్ ప్రాంతంలో అందరికీ ఉచితంగా పానీపూరీ పంచి శభాష్ అనిపించుకుంటున్నాడు అంచల్.
ఇక.. అంచల్ గత 20 ఏళ్ల నుంచి పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. అందుకే.. తనకు కూతురు పుట్టిన సందర్భంగా.. పానీపూరీనే అందరికీ ఉచితంగా ఆఫర్ చేశానని చెప్పుకొచ్చాడు అంచల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పాత డ్రమ్ములు, టైర్లను రీసైకిల్ చేయడం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు
ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన గడియారం ఇది.. విశ్వం గురించి చెబుతున్నదేంటి?
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Viral Video : యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చూస్తూ.. ఈ పిల్లి చేసిన చేష్టలకు వావ్ అనాల్సిందే
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

