e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News పాత డ్ర‌మ్ములు, టైర్ల‌ను రీసైకిల్ చేయ‌డం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు

పాత డ్ర‌మ్ములు, టైర్ల‌ను రీసైకిల్ చేయ‌డం యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని రూ. కోటి సంపాదించాడు

ఈరోజుల్లో డ‌బ్బులు సంపాదించాలంటే.. చ‌దువు ఒక్క‌టే ఉంటే స‌రిపోదు. ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది చాలా ముఖ్యం. స్కిల్ లేక‌పోతే ఏం చేయ‌లేం. చ‌దువు లేక‌పోయినా.. ఏదైనా స్కిల్ ఉన్నా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకే.. నేటి యూత్ ఎక్కువ‌గా చ‌దువు క‌న్నా.. స్కిల్ మీద ఎక్కువ దృష్టి పెడుతోంది.

ప్ర‌మోద్ సుసారె అనే ఓ మెకానిక‌ల్ ఇంజినీర్ కూడా కొత్త‌గా ఆలోచించి.. త‌న స్కిల్‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన ప్ర‌మోద్.. ప‌నికిరాని డ్ర‌మ్ములు, టైర్ల‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్ప‌టికే కోటి రూపాయ‌లు సంపాదించారు. ప్ర‌తి నెలా ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు.

- Advertisement -

ప్ర‌మోద్‌.. 2015 లో మెకానిక‌ల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత పూణెలోని ఓ కంపెనీలో మెయిన్‌టెనెన్స్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆత‌డి జీతం నెల‌కు 12 వేలు. నెల‌కు ఇంటికి 5 వేలు పంపించాక‌.. మిగిలిన డ‌బ్బుల‌తో అడ్జెస్ట్ అయ్యేవాడు. కానీ.. రూపాయి కూడా పొదుపు చేయ‌లేక‌పోయాడు. అయితే.. ప్ర‌మోద్ జీవితం 2017లో మారిపోయింది. 2017లో బిజినెస్ ట్రిప్ కోసం చైనాకు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ కొంద‌రు వ్య‌క్తులు పాడైపోయిన డ్ర‌మ్స్‌, టైర్లు, ఇత‌ర మెటిరియ‌ల్‌తో స‌రికొత్త ఫ‌ర్నీచ‌ర్‌ను త‌యారు చేయ‌డం చూశాడు.

ఈ బిజినెస్ ఏదో బాగుంది అని అనుకున్నాడు. దీన్నే ఇండియాలో కూడా చేయొచ్చు క‌దా. ఎలాగూ ప‌నికిరాని డ్ర‌మ్ములు, టైర్లు చాలా దొరుకుతాయి. వాటిని రీసైకిల్ చేసి ఫ‌ర్నీచ‌ర్ త‌యారు చేస్తే.. ఎలా ఉంటుంది.. అనే ఆలోచ‌న ప్ర‌మోద్‌కు అక్క‌డే వ‌చ్చింది.

ఇండియాకు తిరిగి రాగానే.. ఇటువంటి రీసైక్లింగ్ చేసేవాల్లు ఉన్నారా.. అని ఎంక్వ‌యిరీ చేశాడు. కానీ.. చాలా త‌క్కువ మంది ఈ ఇండ‌స్ట్రీలో ఉన్నార‌ని తెలుసుకొని.. వెంట‌నే ఆ రంగంలోకి దిగాడు. వెంట‌నే పీ2ఎస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే కంపెనీ స్థాపించాడు. పాత డ్ర‌మ్ములు, టైర్ల‌తో చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ను అమ్మ‌డం ప్రారంభించి ఇప్పుడు ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు.

యూట్యూబ్‌లో డ్ర‌మ్ముల‌తో ఫ‌ర్నీచ‌ర్ చేయ‌డం చూసి నేర్చుకొని

ఈ ఫీల్డ్‌లో చాలా త‌క్కువ మంది ఉండ‌టంతో.. డ్ర‌మ్స్, టైర్ల‌తో ఫ‌ర్నీచ‌ర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవ‌డం ప్ర‌మోద్‌కు కొంచెం క‌ష్ట‌మైంది. దీంతో యూట్యూబ్‌నే న‌మ్ముకున్నాడు. చాలా రోజుల పాటు.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి చివ‌ర‌కు ఫర్నీచ‌ర్ త‌యారు చేయ‌డం నేర్చుకున్నాడు. కానీ.. దాని మీద పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించ‌లేక‌పోయాడు. ఒక‌రోజు త‌న బైక్ పంక్చ‌ర్ అయితే.. వేయించ‌డానికి మెకానిక్ షాపున‌కు వెళ్లాడు ప్ర‌మోద్. ప‌నికిరాని పాత టైర్ల‌ను ఎలా అమ్ముతార‌ని ఊరికే మెకానిక్‌ను అడిగాడు. అత‌డు 8 రూపాయ‌ల‌కు కిలో అన్నాడు. అంతే.. వెంట‌నే ఇదేదో లాభ‌సాటి వ్యాపార‌మే అని అనుకున్నాడు. ఎందుకంటే.. త‌క్కువ ధ‌ర‌కే పాత టైర్లు దొరుకుతుండ‌టంతో.. వాటితో త‌యారు చేసిన ఫ‌ర్నీచ‌ర్‌పై ఎక్కువ లాభం పొందొచ్చ‌ని భావించాడు. వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న కొన్ని డబ్బుల‌ను ఇన్వెస్ట్ చేసి.. ఈ బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. సెప్టెంబ‌ర్ 2018లో ఈ బిజినెస్‌ను ప్రారంభించాడు. కానీ.. డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌మోద్ త‌యారు చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ను ఒక్క క‌స్ట‌మ‌ర్ కూడా కొన‌లేదు.

దీంతో రోడ్డు ప‌క్క‌న ఉండే జ్యూస్ స్టాళ్ల ద‌గ్గ‌ర‌, ఫుడ్ స్టాళ్ల ద‌గ్గ‌ర ఈ ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించేవాడు. జ‌న‌వ‌రి 2019లో పూణెలోని ఓ కేఫ్ య‌జ‌మాని.. వాటిని చూసి.. 50 వేల రూపాయ‌ల ఆర్డ‌ర్ ఇచ్చాడు. దీంతో ప్ర‌మోద్ ద‌శ తిరిగింది. అప్పటి నుంచి ఆర్డ‌ర్లు పెర‌గ‌డం ప్రారంభించాయి. ఒకేసారి థానెలో పెద్ద ప్రాజెక్ట్ వ‌చ్చింది. దానికి 5.5 ల‌క్ష‌లు సంపాదించాడు. అలా.. రెండేళ్ల‌లోనే కోటి రూపాయ‌లు సంపాదించాడు ప్ర‌మోద్. ప్ర‌స్తుతం నెల‌కు లక్షలు సంపాదిస్తున్నాడు. త‌న ద‌గ్గ‌ర 14 మంది ప‌నివాళ్లు ఉన్నారు. స్టాఫ్ ఉన్నారు. త‌న కంపెనీ కూడా గ్రో అయింది. హ‌ర్యానా, పంజాబ్, బెంగ‌ళూరు, గోవా, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి ప్ర‌మోద్ ఫ‌ర్నీచ‌ర్ కోసం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్ర‌పంచంలోనే అత్యంత క‌చ్చిత‌మైన గ‌డియారం ఇది.. విశ్వం గురించి చెబుతున్న‌దేంటి?

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

భూమ్మీద సూర్యుడు అస్త‌మించ‌ని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?

Horror Movie Heart Rate Analyst : ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే.. రూ.ల‌క్ష పారితోష‌కం.. ఆ సినిమాలు ఏంటో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana