పెళ్లి అంటేనే ఎవరి జీవితంలోనైనా ఒకేసారి వస్తుంది. ఆ ఘడియ కోసం చాలామంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అందుకే.. పెళ్లి రోజున సూపర్‌గా రెడీ అయి.. అందరినీ ఆశ్చర్యపరుస్తారు. పెళ్లికి వచ్చిన అతిథును నూతన వధూవరులు ఆశ్చర్యపరిస్తే పర్లేదు కానీ.. ఇక్కడ చూడండి.. ఓ పెళ్లి కూతురు ఏకంగా.. పెళ్లికొడుకునే ఆశ్చర్యపరిచింది.
పెళ్లి కొడుకు నోరెళ్లబెట్టి చూడటం తప్పితే ఇంకేం చేయలేకపోయాడు. పెళ్లిమండపంలోకి పెళ్లి కూతురును తీసుకొచ్చేటప్పుడు చూసి షాక్ అయిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే.. వధువును చూస్తూ ఉండిపోయాడు. దీంతో మనోడి పక్కనే ఉన్నవాళ్లు.. అతడి భుజం మీద చేతో విదిల్చేసరికి.. అప్పుడు తేరుకున్నాడు. మొత్తానికి ఆ పెళ్లి కొడుకు ఆశ్చర్యపోయిన తీరును చూసి.. పెళ్లికొచ్చిన అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు అయితే.. పెళ్లికొడుకు విచిత్రమైన ఆశ్చర్యంతో కూడిన ఫేస్‌ను చూసి తెగ నవ్వుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : హెయిర్ కట్ చేయనీయకుండా గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. బార్బర్ ఏం చేశాడంటే?
6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పళ్ల వ్యాపారి.. ఏంటి ఆ కొబ్బరికాయ స్పెషాలిటీ?