6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పండ్ల వ్యాపారి.. ఏంటి ఆ కొబ్బరికాయ స్పెషాలిటీ?
6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పళ్ల వ్యాపారి | మామూలుగా కొబ్బరికాయ ధర ఎంతుంటుంది. మా.. అంటే 20 రూపాయలు ఉంటుంది. కానీ.. ఈ కొబ్బరికాయ కోసం ఓ పళ్ల వ్యాపారి
మామూలుగా కొబ్బరికాయ ధర ఎంతుంటుంది. మా.. అంటే 20 రూపాయలు ఉంటుంది. కానీ.. ఈ కొబ్బరికాయ కోసం ఓ పళ్ల వ్యాపారి.. ఏకంగా రూ.6.5 లక్షలు దారపోశాడు. 6.5 లక్షల రూపాయలు పెట్టి ఈ కొబ్బరికాయను కొన్నాడు. అంత స్పెషల్ ఏముంది ఇందులో.. అంటారా.. పదండి.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఒక్కొక్కరికి ఒక్కో భక్తి. దేవుడి మీద ఉండే భక్తి అపారమైనది. చాలామంది దేవుడిని నమ్మినట్టుగా ఇంకెవరినీ నమ్మరు. దేవుడి కోసం ఏదైనా చేస్తాడు. దేవుడి కృప తమ మీద ఉండటం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే.. డబ్బులు ఉన్నవాళ్లు.. అలా దేవుడి కోసం ఏదైనా చేస్తే ఓకే.. కానీ.. చేతుల్లో డబ్బులు లేకున్నా.. ఓ పండ్ల వ్యాపారి.. చేసిన డేర్నెస్కు అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
బాగల్కోట్ జిల్లాలోని చిక్కలకీ అనే గ్రామంలో 12 వ శతాబ్దంలో నిర్మించిన మలింగరాయ దేవుడి గుడి ఉంది. అది చాలా పవర్ ఫుల్ గుడి అని అక్కడి వారి నమ్మకం. మలింగరాయడి దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి.. దానికి సంవత్సరం మొత్తం పూజలు చేసి.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ముగింపు సందర్భంగా దాన్ని వేలం వేస్తారు దేవస్థాన కమిటీ సభ్యులు.

మలింగరాయ అంటే ఎవరో కాదు.. శివుడి నందినే మలింగరాయగా అక్కడ కొలుస్తారు. నంది విగ్రహం మీద ఉంచి ఆ కొబ్బరికాయకు పూజలు చేస్తారు. విశిష్ట పూజలు అందుకున్న ఆ కొబ్బరికాయ ఎవరి ఇంట్లో ఉండే ఆ ఇంట్లో అన్నీ శుభాలు కలుగుతాయని.. వాళ్లకు అంతా మంచే జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. ప్రతి సంవత్సరం ఆ కొబ్బరికాయను వేలం వేస్తే.. 10 వేల రూపాయల వరకు డబ్బులు వస్తాయట.
కానీ.. ఈ సంవత్సరం మాత్రం.. వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయిన వేలం.. లక్ష, 3 లక్షలు కూడా దాటిందట. ఆ తర్వాత.. మహవీర్ అనే పళ్ల వ్యాపారి.. దానికి 6.5 లక్షలు ఇస్తానని చెప్పడంతో.. చివరకు ఆ కొబ్బరికాయ అతడికే దక్కింది. కొబ్బరికాయ వేలం ద్వారా వచ్చే డబ్బులతో గుడిని అభివృద్ధి చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.

నీకేమైనా పిచ్చా.. ఆ కొబ్బరికాయ కోసం అన్ని డబ్బులు వెచ్చిస్తావా? అని చాలామంది మహవీర్ను తిట్టారట. కానీ.. మహవీర్ మాత్రం డబ్బులు మ్యాటర్ కాదని.. దేవుడి మీద ఉన్న భక్తి, నమ్మకం అనేది చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. చాలా రోజుల కింద.. తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, తన బిజినెస్ లాస్లో ఉన్నప్పుడు.. మలింగరాయ దేవుడిని మొక్కుకుంటే.. తన సమస్యలన్నీ తీరాయట. అందుకే.. ఇప్పుడు అంత డబ్బు వెచ్చించి.. కొబ్బరికాయను దక్కించుకున్నట్టు మహవీర్ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Digital Health ID | ఆధార్ కార్డు తరహాలో మరో కొత్త ఐడీ.. దీంతో లాభమేంటంటే..
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Adhar card | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

