మైకెల్ జాక్సన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆయన ప్రస్తుతం ఈ లోకంలో లేకున్నా.. ఆయన పాటలు, బ్రేక్ డ్యాన్స్ అన్నీ బతికే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ.. ఆయన వేసిన స్టెప్పులు వేస్తూ మైకెల్ ను గుర్తు చేసుకుంటూ ఉంటాం.
ముఖ్యంగా.. మైకెల్ జాక్సన్.. డేంజరస్ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఆ పాటకు మైకెల్ జాక్సన్ వేసిన స్టెప్పులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ పాటకు ఓ వ్యక్తి వేసిన డ్యాన్స్ చూసి అందరూ ఫిదా కావాల్సిందే. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని మరోసారి నిరూపితం అయింది. మైకెల్ జాక్సన్ తాతలా ఉన్నాడే అంటూ అతడి డ్యాన్స్ చూసి అందరూ మైమరిచిపోతున్నారు.
1991 లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్.. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. పాప్ సింగర్ మైకెల్ నుంచి వచ్చిన ఎనిమిదో ఆల్బమ్ అది.
ఆ పాటకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిదా కాని వాళ్లు లేరు. జనరేషన్లు మారిన.. ఆ పాటకు ఉన్న క్రేజ్ కూడా తగ్గడం లేదు. తాజాగా ఆ పాటకు ఓ వ్యక్తి వేసిన డ్యాన్స్ చూస్తే.. మైకెల్ జాక్సన్ మళ్లీ పుట్టాడా అనిపిస్తుంది. నెటిజన్లు అయితే.. అదే అంటున్నారు. సూపర్ గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వ్యక్తికి ఎవరైనా అవకాశాలు ఇవ్వండి. మంచి భవిష్యత్తు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
The Ghost Of Michael Jackson lives within him. pic.twitter.com/l7DDGGyiXV
— Kaveri 🇮🇳 (@ikaveri) September 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ చిలుక సిన్నది కాదు.. చిన్న పిల్లలతో దోస్తీ చేస్తుంది..!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
బుక్కెడు బువ్వకోసం.. ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు.. ఒడిశాలోని ఓ తెగ బతుకు చిత్రమిది
మా నాన్న వాసన కంపు.. చమత్కారంగా తండ్రిపై కవిత రాసిన ఐదేండ్ల కూతురు