Drug Lab : యూట్యూబ్‌లో వీడియోలు చూసి డ్రగ్స్ తయారు చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు
యూట్యూబ్‌లో వీడియోలు చూసి డ్రగ్స్ తయారు చేశాడు | యూట్యూబ్‌లో దొరకని వీడియో ఉండదు. మంచికైనా.. చెడుకైనా.. అన్ని రకాల వీడియోలను అందులో చూడొచ్చు.
యూట్యూబ్‌లో దొరకని వీడియో ఉండదు. మంచికైనా.. చెడుకైనా.. అన్ని రకాల వీడియోలను అందులో చూడొచ్చు. ఏది నేర్చుకోవాలన్నా.. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు. అయితే.. యూట్యూబ్‌ను మంచి కోసం కంటే కూడా చెడు కోసం వాడుకునేవాళ్లు ఎక్కువైపోయారు.

ఓ వ్యక్తి అయితే యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా డ్రగ్ ల్యాబ్‌నే నెలకొల్పాడు. డ్రగ్స్ తయారు చేశాడు. అది కూడా నిషేధిత డ్రగ్(methamphetamine – meth)ను తయారు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.
జైమిన్ సావని.. డ్రగ్ అడిక్ట్. డ్రగ్స్‌కు అలవాటు పడిపోయి.. డ్రగ్స్ లేకుండా ఉండలేకపోయాడు. కొన్ని రోజులు డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాడు. డ్రగ్స్ వేరే వాళ్ల దగ్గరి నుంచి తెచ్చి అమ్మే బదులు.. తనే తయారు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకొని.. వెంటనే యూట్యూబ్‌లో డ్రగ్స్ తయారు చేసే వీడియోలు చూశాడు. వెంటనే సూరత్‌లోని సర్థానా అనే ప్రాంతంలో ల్యాబొరేటరీని ఏర్పాటు చేశాడు. అక్కడ డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించాడు.
రాజస్థాన్‌కు చెందిన తన ఫ్రెండ్ ప్రవీణ్ బిష్ణోయ్.. ఇటీవల సూరత్‌కు వచ్చాడు. తన వెంట 58 గ్రాముల నిషేధిత మెత్ డ్రగ్‌ను తీసుకొచ్చాడు. దాని విలువ సుమారు 6 లక్షలు. దాన్ని సావనికి అందించేందుకు రాగా.. పోలీసులు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి కూపీ లాగడంతో సావని బండారం బయటపడింది.
వెంటనే సావని ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు.. డ్రగ్స్ తయారు చేయడం కోసం ఉపయోగించే వస్తువులను సీజ్ చేశారు. సావనని.. తన సొంతూరులో పట్టుకున్నారు.
యూట్యూబ్‌లో వీడియోలు చూడటంతో పాటు.. రాజస్థాన్‌కు చెందిన డ్రగ్ డీలర్ల దగ్గర డ్రగ్స్ తయారీని నేర్చుకున్నా. ల్యాబ్‌లో డ్రగ్ తయారీ చేయడం ప్రారంభించినప్పటికీ.. నాకు ఇంకా డ్రగ్స్ తయారీ రాలేదు. డ్రగ్స్ తయారీ కోసం రా మెటిరియల్‌ను ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి కొంటా.. అంటూ పోలీసుల ముందు సావని ఒప్పుకోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రూ.13 కోట్లకు ఆ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్
జూకు వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. ఈ యువతి ఏం చేసిందంటే? వైరల్ వీడియో
హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు
how to fail UPSC exam : సివిల్స్‌లో ఎలా ఫెయిల్ అవ్వాలి? ఈ వీడియో చూసి తెలుసుకోండి
చెప్పుతో మొసలిని బెదిరించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

