హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు
హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ | గుడులలో దొంగతనాలు జరగడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు చాలాసార్లు జరిగాయి. గుడులలో ఉన్న హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు.
గుడులలో దొంగతనాలు జరగడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు చాలాసార్లు జరిగాయి. గుడులలో ఉన్న హుండీలను కూడా దొంగలు వదిలిపెట్టలేదు. ఆ ఘటనలు గుడులలో ఉన్న సీసీకెమెరాల్లోనూ రికార్డ్ అయ్యేవి. సీసీఫుటెజ్ ఆధారంగా పోలీసులు.. దాదాపు అందరు దొంగలను పట్టేసుకునేవారు కానీ.. గుడులలో ఉన్న హుండీలు, డొనేషన్ బాక్సులను కూడా దొంగలు వదలడం లేదంటే.. దొంగలు ఎంత మితిమీరిపోయారో అర్థం అవుతోంది.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. థానే వెస్ట్‌లో ఖొపట్ బస్ డిపోకు సమీపంలో ఉన్న కబిర్వాడీ హనుమాన్ టెంపుల్‌కు ఓ యువకుడు రాత్రిపూట వచ్చాడు. అప్పటికి గుడి తలుపులు తెరిచే ఉన్నాయి. పూజారి కూడా లేడు. దీంతో అతడికి దుర్బుద్ధి పుట్టింది. కాసేపు ఫోన్‌తో గుడిలో టైమ్‌పాస్ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ను జేబులో పెట్టుకొని వెళ్లి హనుమంతుడి కాళ్లకు మొక్కి.. అక్కడే ఉన్న డొనేషన్ బాక్స్‌ను అందుకొని అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ ఘటన గుడిలోని సీసీకెమెరాలో రికార్డ్ అయింది. తెల్లారాక.. డొనేషన్ బాక్స్ కనిపించకపోయేసరికి.. గుడి పూజారి మహంత్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను కనిపెట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
how to fail UPSC exam : సివిల్స్‌లో ఎలా ఫెయిల్ అవ్వాలి? ఈ వీడియో చూసి తెలుసుకోండి
చెప్పుతో మొసలిని బెదిరించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

