ఏ జంతువును చూసినా ఎక్కువ భయం కలగదు కానీ.. మొసలిని చూస్తే మాత్రం పరుగో పరుగు. అస్సలు ఆగలేరు. దాన్ని చూస్తేనే దడుసుకుంటారు. ఎక్కడో నీళ్లలో ఉంటేనే భయపడతాం. అటువంటిది మొసలి ముందుకు వస్తుంటే ఎలా ఉంటది. ఇంకా అక్కడే ఉండి కాలక్షేపం చేస్తామా? చేయం కదా. కానీ.. ఈ మహిళ ధైర్యానికి మాత్రం మనం చేతులెక్కి మొక్కాలి.
ఎందుకంటే.. ముందుకు దూసుకొస్తున్న మొసలిని తన చెప్పుతో బెదిరించి.. అక్కడి నుంచి వెళ్లేలే చేసింది. ఓ నీటి ప్రవాహం దగ్గర తన పెట్ డాగ్‌తో కలిసి ఓ మహిళ సేదతీరుతోంది. ఆ మహిళను చూసిన నీళ్లలో ఉన్న మొసలి.. వాళ్ల వైపు దూసుకురాబోయింది. దీంతో మహిళ ఏమాత్రం భయపడకుండా.. తన చెప్పును తీసి మరీ.. దానితో ఆ మొసలిని బెదిరించింది. దీంతో ఆ మొసలి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అయితే.. ఆ వీడియోను చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
పిల్లాడి సైకిల్ పోతే గూఢచారిగా మారిన తల్లి.. ఏం చేసింది?