Viral Video | రైలు ప్రయాణంలో కొందరు ప్రయాణికులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తనతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు భయాందోళనకు గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఓ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పక్కన పట్టాలపై వెళ్తోన్న మరో రైలు డోర్ వద్ద కూర్చున్న ప్రయాణికులను బెల్ట్ (Belt)తో తీవ్రంగా కొడుతూ (Man Hitting Passengers) కనిపించాడు. ఏమాత్రం పట్టుతప్పినా సదరు వ్యక్తి సహా పక్క రైలులోని ప్రయాణికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేది. వీడియో షేర్ చేసిన నెటిజన్.. ‘ఈ కుర్రాడు వేరే ట్రైన్ లో డోర్ దగ్గర కూర్చున్న వాళ్లని బెల్టుతో కొడుతున్నాడు. ఇది నిజమేనా.. ఆ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు రైలు నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది. పెద్ద ప్రమాదం కూడా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. అయితే, బీహార్ లోని చప్రా జిల్లాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తూర్పు మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है 🤔
इस व्यक्ति के बेल्ट से मारने के कारण दरवाजे में बैठा व्यक्ति ट्रेन से गिर भी सकतें है,बड़ी दुर्घटना भी हो सकती है
कृपया ऐसे आसामाजिक आतंकी लोगों पर कड़ी कार्यवाही करें 🙏@RailMinIndia… pic.twitter.com/BQEgHWe9rO— देव 🚩 (@I_DEV_1993) July 7, 2023
Also Read..
Joe Biden | రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
Adipurush writer | ఆదిపురుష్ వివాదం.. క్షమాపణలు చెప్పిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్
Vignesh Shivan | నయన్ దంపతులపై కేసు నమోదు.. ఆస్తి కాజేశారంటూ ఫిర్యాదు..?