మెదడుకు పదును పెట్టాలే కానీ.. మనిషికి గొప్పగొప్ప ఐడియాలు వస్తాయి. చాలామంది ఇప్పటి వరకు అలా తమకు వచ్చిన ఆలోచనలను కార్యరూపం దాల్చి ఎన్నో గొప్ప విషయాలను కనిపెట్టారు. తాజాగా ఓ వ్యక్తి కూడా దేశీ జూగాడ్ అనిపించుకుంటున్నాడు.
మనుషులకు కుక్కలంటే ప్రాణం. అలాగే కుక్కలు ఎప్పుడూ మనుషుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అందుకే చాలామంది పెట్ డాగ్స్‌ను పెంచుకుంటారు. కొందరైతే తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తమ పెంపుడు కుక్కలను తీసుకెళ్తూ ఉంటారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు సైకిల్ మీది తన పెంపుడు కుక్కను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని చూసి మీరు కూడా మెచ్చుకుంటారు. సైకిల్ వెనుక కుక్క కూర్చోలేదు కాబట్టి.. వెనుక స్టాండ్ మీద ఓ ప్లాస్టిక్ కుర్చీని ఏర్పాటు చేశాడు. దాంట్లో కుక్కను కూర్చోబెట్టి ఏంచక్కా ఇద్దరూ కలిసి సైకిల్ మీద షికారుకు వెళ్లారు. ఈ ఫోటోను రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే ఆ వ్యక్తి ఐడియాను మెచ్చుకుంటున్నారు. దేశీ జూగాడ్ అంటున్నారు.
Look what I saw today 😍 pic.twitter.com/YmaBjYMCba
— Dharani Balasubramaniam (@dharannniii) September 24, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి
Viral Video : నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న.. అంటూ ఫోన్‌ను ఏం చేశాడో చూడండి
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్