Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్
తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా | వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లకపోతే
వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లకపోతే.. సడెన్‌గా వర్షం వస్తే.. ఏదైనా చెట్లో లేక.. వర్షం పడని ఏదైనా ఒక ప్లేస్‌కు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మనుషులకు అంటే ఇండ్లు ఉంటాయి. ఎప్పటికీ బయట ఉండరు కాబట్టి.. మిగితా సమయాల్లో ఇంట్లో ఉండి వర్షం బారి నుంచి తప్పించుకుంటారు. మరి.. జంతువుల సంగతి ఏంటి. వాటికి ఇండ్లు ఉండవు. నిలువ నీడ ఉండదు. వర్షం వచ్చినా.. చలి పెట్టిన.. ఎండ కొట్టినా.. అలా రోడ్ల మీద బతకాల్సిందేనా. అందుకే చాలామంది వీధికుక్కలకు షెల్టర్లకు తరలించడం, వాటిని సంరక్షించడం చేస్తుంటారు కొందరు.

బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర చాలా పెట్స్ ఉంటాయి. అయితే.. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో రతన్ టాటా దృష్టికి వచ్చింది. అది దేని గురించి అంటే.. ముంబైలోని తాజ్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి.. వర్షానికి తడుస్తున్న ఓ వీధికుక్కకు తడవకుండా గొడుగు పడతాడు. ఆ ఫోటోను చూసి రతన్ టాటా ఫిదా అయిపోతారు.
ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన టాటా.. ఇది చాలా బెస్ట్ మూమెంట్. వీధికుక్కలకు తోచినంత సాయం చేయడం అనేది గొప్ప పని. తాజ్ ఉద్యోగి చేసిన పనిని నేను అభినందిస్తున్నా.. అంటూ టాటా ఆ ఫోటోను షేర్ చేశారు.
మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే మీరే సార్.. అందుకే మీరంటే అందరికీ ఇష్టం సార్.. అంటూ రతన్ టాటాపై.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఆ ఫోటో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హోటల్ రూంలో స్పై కెమెరా ఉందని అనుమానామా? ఈ ట్రిక్స్‌తో కనిపెట్టేయొచ్చు
నిర్లక్ష్యంగా హెయిర్ కటింగ్ : మహిళకు రూ 2 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం!
Fastest man on two hands : రెండు చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డ్.. వీడియో
RBI on Auto Debit | ఆటో డెబిట్స్కు అదనపు అప్రూవల్.. ఆన్లైన్ ఇన్స్టంట్ పేమెంట్స్ స్తంభిస్తాయా?
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

